Movie News

నిజం కాబోతున్న శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తో తన కంబ్యాక్ ఇస్తానని అభిమానులను ఊరిస్తున్న దర్శకుడు శంకర్ దానికి తగ్గట్టే ట్రైలర్ ద్వారా మొదటి పరీక్ష పాసవ్వడం చూశాం. ఒకప్పటి వింటేజ్ డైరెక్టర్ కనిపించాడని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇండియన్ 2 కొట్టిన దెబ్బకు ఏకంగా ట్రోలింగ్ చవిచూడాల్సి వచ్చిన శంకర్ కు రామ్ చరణ్ సినిమా చాలా కీలకం. బడ్జెట్ పరంగా రాజీ లేకుండా తెలుగులో మొదటిసారి స్ట్రెయిట్ మూవీ చేయడంతో అంచనాల పరంగా బరువు మరింత పెరిగింది. జనవరి 10 ఎంతో దూరంలో లేనందున సినీ ప్రియుల చూపంతా ఎప్పుడెప్పుడు ఆ డేట్ వస్తుందనే దాని మీదే ఉంది.

గేమ్ ఛేంజర్ లాభపడితే ముందుగా ప్రయోజనం కలిగేది ఇండియన్ 3కే. వీటి తర్వాత శంకర్ మరో ప్యాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. వీరయుగ నాయగన్ వేల్పరి అనే పుస్తకం ఆధారంగా మూడు భాగాలతో వందల కోట్ల బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా మలచడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. 2022లోనే దీనికి సంబంధించిన అప్డేట్ మా గుల్టే అందించింది. ఇప్పుడదే నిజమవుతోంది. గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ రూపకల్పనలో సహాయం చేసిన మధురై ఎంపి ఎస్ వెంకటేశన్ రాసిన వేల్పరి నవలలో చాలా చారిత్రాత్మక నేపథ్యం ఉంది. పొన్నియిన్ సెల్వన్ ఈ పుస్తకం నుంచే కొంత స్ఫూర్తి చెందిందనే కామెంట్స్ లేకపోలేదు.

వేల్పరిలో హీరో ఎవరనేది శంకర్ వెల్లడించలేదు. చెన్నై ప్రెస్ మీట్ లో ప్రాజెక్టు మాత్రమే కన్ఫర్మ్ చేశారు. గతంలో బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ చేయొచ్చనే టాక్ వచ్చింది. అపరిచితుడు రీమేక్ వద్దనుకున్నాక శంకర్ ఈ ప్రతిపాదన చెప్పారట. పెన్ స్టూడియోస్ నిర్మించే అవకాశముంది. ఒకవేళ రణ్వీర్ చేయలేని పరిస్థితి వస్తే మాత్రం ఆ స్థానంలో ఎవరొస్తారో చూడాలి. సౌత్ స్టార్ హీరోలందరూ రెండు మూడేళ్ళకు సరిపడా బిజీ ఉన్నారు. మరి శంకర్ తో చేతులు కలపబోయేది రణ్వీరా వేరొకరానేది వేచి చూడాలి. గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 సక్సెస్ అయితే దీనికి మరింత వేగంగా అడుగులు పడతాయి.

This post was last modified on January 3, 2025 10:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

40 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago