గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పోషిస్తున్న అప్పన్న పాత్ర మీద ట్రైలర్ లో పలు క్లూలు ఇచ్చారు కానీ అసలీ క్యారెక్టర్ ఏ స్థాయిలో ఎంత లెన్త్ ఉంటుందనేది సరైన క్లారిటీ లేదు. కార్తీక్ సుబ్బరాజ్ ఏ ఆలోచనతో కథ రాశాడో కానీ జనసేన ఐడియాలజీకి చాలా దగ్గరగా అనిపించేలా అప్పన్న స్థాపించే అభ్యుదయం పార్టీని ఇందులో చూపించారని ఇన్ సైడ్ లీక్. సామాన్యుల పట్ల అరాచక ధోరణి చూపిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో శ్రీకాంత్, సముతిరఖని, రాజీవ్ కనకాలతో కలిసి పార్టీ పెట్టే అప్పన్న తక్కువ సమయంలో ప్రజల మనసులకు దగ్గరవ్వడం పవన్ కళ్యాణ్ తీరుని గుర్తు చేస్తుందని అంటున్నారు.
తర్వాత జరిగే స్టోరీలో ఎస్జె సూర్య ఎంట్రీ, తప్పుడు దారిలో ముఖ్యమంత్రి కావడం, జనాలను దోచుకోవడం, అవినీతి చేయడం ఇవన్నీ సినిమాటిక్ ట్విస్టులు. అమెరికా ఈవెంట్ లో దిల్ రాజు గేమ్ ఛేంజర్ లో వర్తమాన సంఘటనలు చాలా చూస్తారని చెప్పడం దీని గురించేననే టాక్ అభిమానుల మధ్య ఉంది. సో ఒకవేళ ఇదంతా నిజమైతే మాత్రం ఫాన్స్ కి మాములు కిక్కు దక్కదు. ఇప్పటిదాకా రామ్ చరణ్ కెరీర్ లో పూర్తి స్థాయి పొలిటికల్ మూవీ లేదు. ఇప్పుడది నెరవేరబోతోంది. ఎమోషన్స్ కూడా అప్పన్నకే ఎక్కువగా ఉంటాయని, ఫ్లాష్ బ్యాక్ కట్టిపడేస్తుందని ఆల్రెడీ తిరుగుతున్న లీకులు నొక్కి చెబుతున్నాయి.
గతంలో చరణ్ డ్యూయల్ రోల్ చేసినప్పటికీ గేమ్ ఛేంజర్ మాత్రం పెర్ఫార్మన్స్ పరంగా ఛాలెంజింగ్ నిలవనుంది. శంకర్, రాజమౌళి ఎక్కువగా ఎలివేట్ చేస్తోంది కూడా దీని గురించే. ఇంకో వారం రోజుల్లో థియేటర్లలో రాబోతున్న గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో దిగుతున్న తొలి పుంజు. ఓపెనింగ్స్ పరంగా ఫ్యాన్స్ కొత్త రికార్డులు ఆశిస్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ అతిథిగా జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హైప్ మరింత పెరుగుతుందని ఎదురు చూస్తున్నారు. వినయ విధేయ రామ తర్వాత చరణ్ సోలో హీరోగా నటించిన సినిమా ఇదే. ఆచార్య క్యామియో, ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ కాబట్టి కౌంట్ కాలేదు.
This post was last modified on January 3, 2025 3:34 pm
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక…
నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…
తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…
గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…
టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్కు…