ఓనమాలు అనే మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు క్రాంతి మాధవ్. ఆయన చేసిన సినిమాలు తక్కువే కానీ.. అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించాడు. ‘ఓనమాలు’ మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్నా పెద్దగా వసూళ్లు రాలేదు. కానీ రెండో చిత్రం ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్‌ను కూడా అందుకుంది. దీంతో క్రాంతి మాధవ్ మీద అంచనాలు పెరిగాయి.
కానీ క్రాంతి మాధవ్ మూడో చిత్రం ‘ఉంగరాల రాంబాబు’ ఆయనకున్న మంచి పేరును చెడగొట్టింది. అదసలు ఆయన శైలి సినిమాలాగే అనిపించలేదు. ఆపై ఆయన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తీశాడు. ఈ సినిమాలో క్రాంతి మాధవ్ అభిరుచి కనిపించింది కానీ.. ఇది కమర్షియల్‌గా పెద్ద డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడు కనుమరుగైపోయాడు. నాలుగేళ్లుగా ఆయన ఊసే లేదు టాలీవుడ్లో.
ఐతే చాలా గ్యాప్ తర్వాత క్రాంతి మాధవ్ మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ఆయన దర్శకత్వంలో ‘డీజీఎల్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ప్రి టీజర్ వదిలారు. హీరో హీరోయిన్ల ముఖాలు చూపించకుండా వాళ్లిద్దరూ కౌగిలింతలో ఉండగా.. వాయిస్ ఓవర్ వచ్చింది.
“లవ్ వన్ సైడ్ కాదు. టూ సైడ్స్ కాదు. అన్ని దిక్కులూ దానియే. లవ్ ఈజ్ బ్లడీ 360 డిగ్రీస్” అంటూ సాగింది ఈ డైలాగ్. ప్రి టీజర్‌ను బట్టి చూస్తే సినిమా కొంచెం బోల్డ్‌గా, ట్రెండీగా ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ సినిమాలో లీడ్ రోల్స్ ఎవరు చేస్తున్నారో ఇంకా వెల్లడి కాలేదు. ఆర్తి క్రియేటివ్ టీమ్ బేనర్ మీద గంటా కార్తీక్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సీనియర్ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ సినిమాకు ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నాడు. తెలంగాణలోని ఖాజీపేట నేపథ్యంలో సాగే ఈ సినిమాకు వాస్తవ ఘటనలే స్ఫూర్తి అట. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on January 3, 2025 11:14 am
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…