ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించనున్న కొత్త చిత్రానికి హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభోత్సవ వేడుకను సింపుల్‌గా కానిచ్చేసింది చిత్ర బృందం.
ఇందులో రాజమౌళి, మహేష్‌లతో పాటు పరిమిత సంఖ్యలో చిత్ర బృందం, కొందరు ప్రముఖుల హాజరైనట్లు తెలుస్తోంది. ఐతే రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది.. సినిమా ఎప్పుడు పూర్తయి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే విషయాల్లో క్లారిటీ లేదు.
ఈ విషయంలో రాజమౌళి వర్కింగ్ స్టైల్ మీద బాగా అవగాహన ఉన్న హీరో రామ్ చరణ్ ఒక అంచనా వేయడం విశేషం. ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరైన నేపథ్యంలో అభిమానుల నుంచి కొన్ని ప్రశ్నలు తీసుకున్నాడు చరణ్.
ఇందులో భాగంగా రజామౌళి-మహేష్ సినిమా ఎప్పుడు రిలీజ్ కావచ్చని అడిగారు. దీనికి చరణ్ బదులిస్తూ.. ‘‘కొవిడ్ లాంటివి లేకపోతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏడాదిన్నరలో వచ్చేస్తుంది’’ అని చెప్పాడు.
ఇంతలో మైక్ అందుకున్న రాజమౌళి బాగా ట్రైనింగ్ ఇచ్చా అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ‘బాహుబలి’ రెండు పార్టులకు కలిపి రాజమౌళి ఐదేళ్ల సమయం తీసుకోగా.. ‘ఆర్ఆర్ఆర్’ను కొంచెం త్వరగానే పూర్తి చేశాడు. కానీ కొవిడ్ వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమైంది.
మహేష్ బాబు సినిమా కోసం ప్రి ప్రొడక్షన్, రిహార్సల్స్ కోసం బాగానే టైం వెచ్చించారు. అయినా సరే.. ఈ సినిమా స్కేల్ దృష్ట్యా మేకింగ్ పూర్తయి విడుదల కావడానికి కనీసం ఇంకో రెండేళ్ల సమయం అయినా పడుతుందని అంచనా వేస్తున్నారు.
జనవరిలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కావచ్చని సమాచారం. ప్రస్తుతానికి అయితే మహేష్ ఫ్యాన్స్ 2026 రెండో అర్ధంలో కానీ, 2027 ప్రథమార్ధంలో కానీ సినిమా రిలీజవుతుందని అనుకుంటున్నారు.
This post was last modified on January 2, 2025 10:50 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…