Movie News

మహేష్ – రాజమౌళి : ఇది కూడా రహస్యమేనా జక్కన్నా…

ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి. కానీ రాజమౌళి మాత్రం తన సినిమాల నుంచి ఏ చిన్న లీక్ లేకుండా జాగ్రత్త పడతారు. సినిమా మొదలైన దగ్గర్నుంచి ముగిసే వరకు ఆయన టీం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ సినిమా నుంచి ఏ విశేషం బయటికి పోకుండా చూసుకుంటుంది. ఐతే సినిమా చిత్రీకరణకు సంబంధించే కాదు.. ముహూర్త వేడుకకు సంబంధించిన విశేషాలు కూడా బయటికి రాకుండా చూసుకుంది చిత్ర బృందం.

గురువారమే ఈ సినిమా ముహూర్త వేడుకను హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించారు. మహేష్-రాజమౌళి సినిమా రేంజ్ చాలా పెద్దదైనా.. ముహూర్త వేడుక విషయంలో మాత్రం పెద్దగా హడావుడి చేయట్లేదని తెలుస్తోంది. మామూలుగా ఇలాంటి వేడుకలు ప్రొడక్షన్ హౌస్‌లకు సంబంధించిన కార్యాయాల్లో లేదా గుడిలో కొంచెం ఘనంగా చేస్తుంటారు. కానీ మహేష్-రాజమౌళి సినిమా వేడుకను మాత్రం నగరం బయట సింపుల్‌గా చేశారు.

మీడియాకు కూడా అనుమతి లేదు. మామూలుగా తన సినిమాల ముహూర్త వేడుకలకు రాని మహేష్ కూడా ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించి టీం నుంచి ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటికి రాలేదు. లీక్స్ కూడా ఏమీ లేవు. సినిమాకు సంబంధించి ఎలాగూ ఏ సమాచారం బయటికి రాదు. కానీ ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించి ముహూర్త వేడుక ఫొటోలు, వీడియోలు అయినా రిలీజ్ చేయాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ బయటికి రావడానికి కనీసం ఏడాది పట్టొచ్చు. ఈ కాలంలో మహేష్ కూడా బయట కనిపించే అవకాశాలు లేవు. సినిమా రిలీజ్ కోసం రెండేళ్లకు పైగా ఎదురు చూడాలి. ఈ నేపథ్యంలో ముహూర్త వేడుకను కూడా రహస్యంగా ఉంచడం కరెక్టా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఐతే ఈ వేడుకకు మీడియాను ఆహ్వానించకపోయినా.. వెంటనే ఏ ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేయకపోయినా.. కొంచెం హడావుడి తగ్గాక అయినా ఆ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారని భావిస్తున్నారు.

This post was last modified on January 2, 2025 7:01 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రజ్ఞానంద్ చెస్ మాస్టర్స్ ఛాంపియన్… గుకేశ్‌పై ఘన విజయం!

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…

54 minutes ago

సుపరిపాలన రూపశిల్పి చంద్రబాబే

1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…

1 hour ago

అంబానీ చేత చప్పట్లు కొట్టించిన కుర్రాడు…

ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…

2 hours ago

‘పులిరాజు’ ఫోటో వెనుక అసలు కథ

ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…

2 hours ago

అరవింద్ మాటల్లో అర్థముందా అపార్థముందా

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…

2 hours ago

బాలయ్యకు తిరుగు లేదు… ‘హిందూపురం’పై టీడీపీ జెండా

టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…

2 hours ago