ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న కొత్త సినిమాల ఇక్కట్లు అంతా ఇంతా కాదు. డిసెంబర్ 20 అనుకున్న సారంగపాణి జాతకం కాంపిటీషన్ వల్ల వెనక్కు తగ్గింది. పుష్ప 2 హవా జోరుగా ఉండటం కూడా ఒక కారణమే. ప్రియదర్శి హీరోగా రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ కి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకులు. గత నెల మొదటి వారంలోనే ప్రమోషన్లు మొదలుపెట్టి ఇంటర్వ్యూలు చాలానే ఇచ్చారు. కట్ చేస్తే ఫ్రెష్ గా ఎప్పుడు రావాలనేది పజిల్ గా మారిపోయింది. ఏప్రిల్ దాకా పెద్ద సినిమాల తాకిడి అడ్డు పడుతోంది.
బ్రహ్మానందం, వాళ్ళబ్బాయి గౌతమ్ కాంబోలో రూపొందిన బ్రహ్మ ఆనందం సైతం నిన్న నెలే రావాలనుకుంది. తర్వాత వాయిదా వేసుకుంది. బజ్ లేదు కాబట్టి సోలోగా రావడం తప్ప వేరే మార్గం లేదు. అటు చూస్తేనేమో బాక్సాఫీస్ వద్ద ఖాళీ స్లాట్ కనిపించడం లేదు. నారా రోహిత్ సుందరకాండ మొన్న దసరాకెప్పుడో అనుకుని టీజర్ కూడా వదిలారు. కానీ తర్వాత ఎలాంటి ఊసు లేదు. ఈలోగా రోహిత్ భైరవం పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు రెండు సిద్ధమవుతున్నాయి. రెండోది మాస్ కంటెంట్ అందులోనూ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కాబట్టి మార్కెట్ పరంగా ఇబ్బంది లేదు కానీ సుందరకాండకు ఈజీ కాదు.
సంక్రాంతికి రావాలనుకున్న సందీప్ కిషన్ మజాకా మనసు మార్చుకుని సైలెంట్ అయిపోయింది. దర్శకుడు త్రినాధరావు నక్కిన కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ థియేటర్ల కొరత కారణంగా నిర్మాత వద్దనుకున్నారు. ఫిబ్రవరి ఆప్షన్ ని సీరియస్ గా చూస్తున్నారు. క పుణ్యమాని కిరణ్ అబ్బవరం దిల్ రుబాకి ఎలాంటి సమస్య లేదు. వాలెంటైన్ రోజు విశ్వక్ సేన్ లైలాతో పాటు వచ్చేలా ఉంది. మార్కెట్ ఉన్న హీరోలకు ఇబ్బంది లేదు కానీ క్యాస్టింగ్ బ్యాకప్ లేని సినిమాలు మాత్రం సరైన డేట్ కోసం కిందా మీదా పడుతున్నాయి. తీయడం ఒక ఎత్తయితే విడుదల తేదీని సెట్ చేసుకోవడం ఇంకా పెద్ద సవాల్.
This post was last modified on January 2, 2025 6:34 pm
మలయాళంలో గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా ‘మార్కో’. జనతా…
సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్ కోసం టాలీవుడ్ బాగానే…
విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ…
ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన…
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…
బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…