కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి చూపు ట్రైలర్ మీదే ఉంది. మూడేళ్ళకు పైగా సుదీర్ఘ నిర్మాణంలో ఉండి ఫ్యాన్స్ ఓపికకు పరీక్ష పెట్టిన దర్శకుడు శంకర్ ఎట్టకేలకు రామ్ చరణ్ ని మూడు షేడ్స్ లో చూపించేందుకు సిద్ధం చేశాడు. నిర్మాతగా దిల్ రాజు 50వ సినిమాగా భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు. ఇవాళ హైదరాబాద్ ఏఎంబిలో రాజమౌళి అతిథిగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హీరోతో పాటు ప్రధాన క్యాస్టింగ్ మొత్తం పాల్గొంది. ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టే రెండున్నర నిమిషాలకు దగ్గరగా ఉన్న ట్రైలర్ వీడియోని రిలీజ్ చేశారు.
కథకు సంబంధించిన కీలకమైన క్లూస్ అయితే ఇచ్చారు. ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ (రామ్ చరణ్) నిజాయితీకి మారుపేరు. కలెక్టర్, పోలీస్ ఆఫీసర్ గా తన డ్యూటీ ఏదైనా సరే పర్ఫెక్ట్ గా చేయడం అలవాటు. అలాంటి వాడి జీవితంలో చీడపురుగు లాంటి ముఖ్యమంత్రి మోపిదేవి (ఎస్జె సూర్య) వస్తాడు. అతనికి రామ్ తండ్రైన అప్పన్న(రామ్ చరణ్) కు ఏదో సంబంధం ఉంటుంది. ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. చివరికి ఎవరు గెలుస్తారనేది తెలిసిందే అయినా పొలిటికల్ గేమ్ లో రామ్ సాధించే విజయం ఎలా ఉంటుందనేదే శంకర్ తెరమీద చేయబోయే మేజిక్. దాన్నే విజువల్స్ లో చూపించారు.
వింటేజ్ శంకర్ ని చూసి చాలా సంవత్సరాలయ్యిందని ఫీలయ్యే సినీ ప్రియులకు ఫుల్ మీల్స్ అనిపించేలా, చరణ్ అభిమానులకు బిర్యానీ ట్రీట్ లా కట్ చేయడం పేలింది. ముఖ్యంగా రామ్ చరణ్ మ్యానరిజం, అప్పన్న క్యారెక్టరైజేషన్, ఎస్జె సూర్యతో ముఖాముఖీ ఫైర్ అనిపించేలా ఉన్నాయి. సాయిమాధవ్ బుర్ర సంభాషణలు, తమన్ బీజీఎమ్ రెండూ ఎలివేట్ అయ్యాయి. వివిధ గెటప్స్ లో చరణ్ మాత్రం సూపర్బ్ అనిపించేసాడు. అసలు సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే ఒకే ఒక్కడు, భారతీయుడు మాయాజాలం మరోసారి రిపీట్ అవుతుందనే నమ్మకం పెట్టుకోవచ్చు. ఇది పెరగడానికి అవసరమైన ఎనర్జీ ట్రైలర్ లో ఉంది.
This post was last modified on January 2, 2025 6:30 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్…
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు స్పందించాయి. రాజకీయ వర్గాల నుంచి పారిశ్రామిక వర్గాల…
నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండేల్ రాజ్ ని పుష్పరాజ్ కలుసుకోవడాన్ని చూసి ఆనందిద్దామని ఎదురు చూసిన…
వైసీపీ అధినేత జగన్ తన బ్రిటన్ పర్యటన ముగించుకుని చాలా రోజుల తర్వాత ఏపీకి వస్తున్నారు. వాస్తవానికి ఆయన నాలుగు…
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…
పియర్ పండు, లేదా బేరిపండు, రుచిలో మధురమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పండు…