అభిమానులు రోజుకు కనీసం ఒక్కసారైనా తలుచుకోనిదే నిద్రపోని ఎస్ఎస్ఎంబి 29 ఇవాళ పూజ కార్యక్రమంతో మొదలైపోయింది. టాలీవుడ్ నే కాదు యావత్ దేశాన్ని షేక్ చేయబోయే ఈ కాంబినేషన్ ప్రకటన స్టేజి నుంచే ఎన్నో సంచలనాలకు దారి తీసింది. ఇవాళ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన పూజా కార్యక్రమాలకు మహేష్ బాబు హాజరై తన సెంటిమెంట్ ని బ్రేక్ చేసుకున్నాడు. చాలా ఏళ్లుగా తన కొత్త సినిమా ఓపెనింగ్ కి మహేష్ రాకపోవడం సంప్రదాయంగా మారింది. తన స్థానంలో నమ్రతాను పంపించేవాడు తప్ప అందుబాటులో ఉన్నా సరే హాజరు కాకపోవడం పరిపాటి. ఒకప్పుడు వచ్చేవాడు కానీ ఇప్పుడు లేదు.
జక్కన్న కోసం సూపర్ స్టార్ ఏకంగా తన అలవాటుని మార్చుకోవడం ఒకరకంగా సెన్సేషనని చెప్పాలి. ఇక్కడితో అయిపోలేదు. ఈ కలయిక మహేష్ 15 సంవత్సరాల స్వప్నం. 2010 సంవత్సరం మే 22న రాజమౌళితో తాను కలిసి పనిచేయబోయే ప్రాజెక్టు కార్యరూపం దాల్చబోతోందంటూ ట్విట్టర్ ద్వారా తను షేర్ చేసుకున్న గుడ్ న్యూస్ ఇప్పుడు వైరలవుతోంది. చెప్పాడు కానీ అప్పట్లో ఇది సాధ్యం కాలేదు. దర్శకధీర ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి రెండు భాగాలు, RRR లతో బిజీ అయిపోవడంతో మళ్ళీ ఎలాంటి చప్పుడు లేకుండా పోయింది. ఇన్నేళ్ల తర్వాత 2025లో కోట్లాది మహేష్ ఫ్యాన్స్ కల నెరవేరింది.
ఇకపై రాబోయే రోజుల్లో ఏ చిన్న లీక్ అయినా పెద్ద బ్లాస్ట్ అయ్యేలా ఉంది. ఇప్పటికే క్యాస్టింగ్ కు సంబంధించిన చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రాజమౌళి అఫీషియల్ గా ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ కోసం మీడియాతో పాటు మూవీ ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఇవాళ గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దీని గురించి ప్రస్తావన వచ్చే అవకాశముంది కానీ జక్కన్న తప్పించుకునే ఛాన్సే ఎక్కువ. ఏది అడిగినా ఇది సందర్భం వేదిక కాదు అంటారేమో. ఇకపై 2027 దాకా థియేటర్లో మహేష్ ని చూడాలంటె కేవలం రీ రిలీజులతోనే సర్దుకోవాలి. అప్పటిదాకా అప్డేట్స్ వర్షంలో తడిసేందుకు ఎదురు చూడాలి.
This post was last modified on January 2, 2025 1:16 pm
ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ప్రతిసారి విపరీతంగా ఆలస్యం కావడం గతంలో చూశాం. అయితే గత…
ఓ మంచి సక్సెస్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. విపరీతమైన హైప్ మధ్య రిలీజైన…
పారితోషికాలు తీసుకుని సినిమాల్లో నటించేస్తారు కానీ చాలా మంది ఆర్టిస్టులు ప్రమోషన్లంటే మాత్రం అదేదో తమ బాధ్యత కాదన్నట్టు దూరంగా…
ఒకప్పటి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత శ్రీదేవికి ఎంత పెద్ద వీరాభిమానో తెలిసిందే. శివ తర్వాత కేవలం…
వైసీపీ హయాంలో జగన్ విద్యార్థులకు గోరుముద్ద నుంచి అమ్మఒడి వరకు అన్నీ ఇచ్చారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్న సంగతి…
పుష్ప 2 ది రూల్ థియేట్రికల్ రన్ ముగింపుకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నా రికార్డులు మాత్రం ఆగడం లేదు. డిసెంబర్…