సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ప్రారంభానికి జనవరి 2 ఎంచుకోవడం హాట్ టాపిక్ అయిపోయింది. రెగ్యులర్ షూటింగ్ కి ఎప్పుడు వెళ్ళేది ఇంకా వెల్లడించలేదు కానీ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు ఎక్కువ సమయం పట్టదు. దీనికి సంబంధించిన కొన్ని క్రేజీ లీక్స్ ఆశ్చర్యం కాదు సంభ్రమాశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ప్రాథమికంగా దీనికి అనుకున్న బడ్జెట్ 1000 కోట్లకు పైమాటేననే టాక్ గతంలోనే రాగా ఇప్పుడది నిజమేననే దిశగా ప్లాన్స్ జరుగుతున్నాయట. సోనీ, డిస్నీ లాంటి సంస్థల భాగస్వామ్యం ఉండొచ్చని వినికిడి.
రాజమౌళి, మహేష్ బాబు తమ రెగ్యులర్ పారితోషికాలు కాకుండా లాభాల్లో 40 శాతం వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని ఇన్ సైడ్ టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ ఆ మేరకు నిర్మాతలతో అంగీకారం జరిగిపోయిందని అంటున్నారు. పెట్టుబడి ఎంత పెట్టినా సరే దానికి రెండు మూడింతలు ఎక్కువ వసూలు చేసే కెపాసిటీ దీనికి ఉండటంతో ఆకాశమే హద్దుగా బిజినెస్ జరుగుతుంది. మొదటి భాగం 2027, రెండో భాగం 2029లో రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ టూ పార్ట్ న్యూస్ అఫీషియల్ గా బయటికి వచ్చేది జక్కన్న, మహేష్ బాబులు పెట్టే ప్రెస్ మీట్ లోనే. అప్పటిదాకా వెయిట్ చేయాలి.
బాహుబలి కన్నా ముందు రాజమౌళి కమిట్ మెంట్ ఇచ్చిన నిర్మాతలు ఇద్దరు. డివివి దానయ్యకు ఆర్ఆర్ఆర్ ద్వారా దాన్ని నెరవేర్చారు. ఇప్పుడు కెఎల్ నారాయణకు మహేష్ 29 ద్వారా ఆ మాటను పూర్తి చేస్తున్నారు. ఈ కాంబినేషన్ కోసమే ఎంతో కాలంగా నిర్మాణానికి దూరంగా నారాయణ తిరిగి యాక్టివ్ ప్రొడ్యూసర్ కాబోతున్నారు. అటవీ నేపథ్యంలో జంతువులు, నిధి నిక్షేపాలు, అడ్వెంచర్లు ఇలా ఎన్నో సాహసోపేతమైన యాక్షన్ ఎపిసోడ్లు ఇందులో బోలెడు ఉంటాయట. సింపుల్ గా చెప్పాలంటే ట్రిపులార్ కు పదింతలు ఎక్కువ విజువల్ గ్రాండియర్ గా ఉంటుందని సమాచారం. చాలా క్రేజీ కదూ.
This post was last modified on January 2, 2025 10:21 am
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…