సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. కమల్ హాసన్ ని పొట్టివాడిగా మార్చి విచిత్ర సోదరులు తీసినా, బాలకృష్ణని శ్రీకృష్ణదేవరాయలుగా ఆదిత్య 369లో చూపించినా, జానపదాలు తగ్గిపోయిన రోజుల్లో భైరవ ద్వీపంతో దానికి తిరిగి జీవం పోసినా ఆయనకే చెల్లింది. ఎన్నో ట్రెండ్ సెట్టర్స్ పరిశ్రమకు కానుకగా ఇచ్చారు. అసలు మాటలే లేని పుష్పక విమానంతో బాషలకున్న సరిహద్దులు చెరిపేసి మొదటి ప్యాన్ ఇండియా మూవీ ఇచ్చిన ఘనత ఆయనకే చెల్లింది. ఎనిమిది పదులు దాటిన వయసులోనూ చలాకీగా ఉండటం అందరికీ సాధ్యమయ్యేది కాదు.
సింగీతంతో ఉన్న అనుబంధంతో ఈ లెజెండరీ అనుభవాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో గత నెల కమల్ హాసన్ అపూర్వ సింగీతం పేరుతో ఫిలిం ఫెస్టివల్ గా నాలుగు రోజులు స్పెషల్ ఈవెంట్ చేశారు. రాజా పార్వై (అమావాస్య చంద్రుడు) స్క్రీనింగ్ తో మొదలుపెట్టి వివిధ క్లాసిక్స్ ని ప్రదర్శిస్తూ ఎందరో మహామహులను భాగం చేసి ఫిలిం మేకింగ్ ని ఒక రిఫరెన్స్ గా నిర్వహించారు. నాగ అశ్విన్, లోకేష్ కనగరాజ్, మణిరత్నం, రాజీవ్ మీనన్, సంతాన భారతి, వైరముత్తు, సుహాసిని, అక్కినేని అమల, పిసి శ్రీరామ్, సిద్దార్థ్, శివ కార్తికేయన్, నాజర్, ఇళయరాజా, దేవిశ్రీ ప్రసాద్ లాంటి ఎందరో దిగ్గజాలు ఈ వేడుకకు విచ్చేశారు.
ఇంత ఏజ్ లోనూ సింగీతం శ్రీనివాసరావు వచ్చిన అతిథులతో ఓపికగా కబుర్లు చెబుతూ, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వివరణాత్మకంగా జవాబులు చెబుతూ ఉల్లాసంగా గడిపేశారు. ఇప్పటి ప్యాన్ ఇండియా సినిమాల పట్ల ఆయనకున్న అవగాహన చూసి తెల్లబోవడం గెస్టుల వంతయ్యింది. ఇలాంటివి తెలుగులోనూ జరగాలి. రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి లాంటి సీనియర్ దర్శకులను ఇలాంటి వేదికలకు తీసుకురావాలి. కె విశ్వనాధ్ కాలం చేశారు కానీ లేదంటే ఆ మహానుభావుడి జ్ఞాపకాలు నిక్షిప్తం అయ్యేవి. కమల్ తీసుకున్న చొరవ మూవీ లవర్స్ నే కాదు భవిష్యత్తు దర్శకులకు కూడా గొప్ప పాఠాలు అందించిందంటే అతిశయోక్తి కాదు.
This post was last modified on January 1, 2025 7:15 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…