ఒక సినిమా లేదా సిరీస్ ఏ అంచనాలు లేకుండా విడుదలై ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఉర్రూతలూగించి సెన్సేషనల్ హిట్టయ్యాక.. దానికి సీక్వెల్ తీస్తుంటే భారీ అంచనాలు నెలకొంటాయి. పార్ట్-2 కోసం ఉత్కంఠగా ఎదురు చూసే ప్రేక్షకులు అది వచ్చాక ఎగబడి చూస్తారు. ఐతే ఇలాంటి స్థితిలో అంచనాలను అందుకోవడం చాలా చాలా కష్టం. చాలా కొన్ని సినిమాలు, సిరీస్‌ల సీక్వెల్స్ మాత్రమే ప్రేక్షకులను సంతృప్తి పరుస్తాయి.
ఐతే సీక్వెల్ పార్ట్-1 స్థాయిలో మెప్పించకపోయినా ఓ మోస్తరుగా అయినా అనిపించే స్థాయిలో అయినా ఉండాలి. కానీ ‘స్క్విడ్ గేమ్’ సీజన్-2 మాత్రం కనీస స్థాయిలో కూడా అంచనాలను అందుకోలేకపోయింది. క్రిస్మస్ వీకెండ్లో నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేసిన రెండో సీజన్ ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది. మూడేళ్ల నిరీక్షణకు తెరపడుతోందని.. ఈ సిరీస్ స్ట్రీమ్ అవ్వడం ఆలస్యం, ఎగబడి చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ‘స్క్విడ్ గేమ్-2’ మీద భారీగా పెట్టుబడి పెట్టిన నెట్ ఫ్లిక్స్.. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి షాకయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
దీనికి వ్యూయర్ షిప్ ఆశించిన స్థాయిలో లేదు. నెగెటివ్ రివ్యూలు రావడంతో ‘స్క్విడ్ గేమ్-2’ వరల్డ్ వైడ్ టాప్‌లో ఏమీ ట్రెండ్ కావట్లేదు. రెండో వారానికే సిరీస్ బాగా వెనుకబడిపోయింది. ‘స్క్విడ్ గేమ్’తో నెట్ ఫ్లిక్స్‌కు భారీగా సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయి. కేవలం ఈ సిరీస్ చూడ్డానికే నెట్ ఫ్లిక్స్ ఖాతాదారులుగా మారిన వాళ్లు కోట్లల్లో ఉంటారు. వ్యూయర్ షిప్ మామూలుగా రాలేదు. కానీ రెండో సీజన్‌కు రెస్పాన్స్ పూర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్‌లోనే ఈ సిరీస్ కాన్సెప్ట్ తెలిసిపోగా.. రెండో సీజన్లో మళ్లీ పాత్రలతో అలాంటి గేమ్సే ఆడించడంతో ఏమాత్రం ఉత్కంఠ లేకపోయింది.
కొత్తగా ఏ సర్ప్రైజ్ లేకపోయింది. ఎక్కడా ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపే సన్నివేశాలు లేకపోయాయి. పైగా కథలోకి వెళ్లడానికే చాలా టైం తీసుకోగా.. ఆ తర్వాత కూడా కొత్త సీన్లేవీ లేకపోవడం, టెన్షన్ బిల్డ్ కాకపోవడంతో ప్రేక్షకులకు కిక్కు రాలేదు. ఇక కథను మధ్యలో ఆపేసి మూడో సీజన్ కోసం ఎదురు చూడాలని చెప్పడంతో క్లైమాక్స్ కూడా తేలిపోయినట్లయింది. ఈ నేపథ్యంలోనే ‘స్క్విడ్ గేమ్-2’కు ఆశించిన స్పందన కనిపించడం లేదని తెలుస్తోంది.
This post was last modified on January 1, 2025 3:39 pm
చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ…
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు నిర్మించేందుకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు ఆర్థిక, వాణిజ్య…
గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమాలో వేగంగా ఎదిగిన కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకడు. దివంగత రాకేష్ మాస్టర్ దగ్గర…
మనలో చాలామందికి పొద్దున నిద్రలేచిందే టీ లేక కాఫీ ఏదో ఒకటి తాగకపోతే రోజు ప్రారంభమైనట్లు ఉండదు. అయితే చాలాకాలంగా…
అవును.. మీరు చదివింది నిజమే. ఇలాంటి వాళ్లు ఉంటారా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఇప్పుడు ఇదే పెద్ద ట్రెండ్…
టాలీవుడ్ లో అసలు అపజయమే ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్…