పుష్ప షూటింగ్ మొదలు పెట్టడానికి అల్లు అర్జున్ ఏమాత్రం తొందర పడడం లేదు. ఇప్పుడు షూటింగ్ మొదలు పెడితే సమ్మర్ టైమ్‍కి లేదా జులై/ఆగస్ట్ కి ఈ చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చు. కానీ అల్లు అర్జున్ ఆ టైమ్‍కి రిలీజ్ చేయడంపై ఆసక్తి చూపించడం లేదని సమాచారం. ఎలాగో సమ్మర్ రిలీజ్ మిస్ అవుతుందనేది క్లియర్‍గా తెలుస్తోంది కనుక సుకుమార్‍పై ఒత్తిడి పెట్టకుండా వచ్చే దసరాకి పుష్ప రిలీజ్ అయ్యేలా ప్రణాళిక వేసుకుంటున్నట్టు భోగట్టా.
ఆచార్య, రాధేశ్యామ్ లాంటివి సమ్మర్‍లో వచ్చేస్తే, ఆర్.ఆర్.ఆర్. 2022 సంక్రాంతికి వెళ్లవచ్చు కనుక ఎలాంటి టెన్షన్ లేకుండా దసరా రిలీజ్ ప్లాన్ చేసుకుంటే తాపీగా షూటింగ్ చేసుకోవచ్చునని అల్లు అర్జున్ ధీమా. సుకుమార్‍కి వేగంగా షూటింగ్ చేసే అలవాటు లేదు కనుక అతడిపై అనవసరపు ఒత్తిడి పెడితే మొదటికే మోసం వచ్చే ఛాన్సుంది. అందుకే అలాంటి రిస్కులేమీ లేకుండా దసరా బెస్ట్ రిలీజ్ డేట్ అని ఆ స్లాట్ మీద పుష్ప కర్చీఫ్ వేసినట్టు టాక్ వినిపిస్తోంది.
కొరటాల శివ సినిమా షూట్ మొదలయ్యేది కూడా ఆగస్ట్ తర్వాతే కనుక అల్లు అర్జున్‍కి ఆ కంగారు కూడా లేనట్టుంది. అల వైకుంఠపురంలో అంత పెద్ద హిట్ కావడంతో వెంటనే హిట్ ఇచ్చేయాలనే ఒత్తిడి లేకపోవడం కూడా బన్నీకి బాగా కలిసి వచ్చింది.
This post was last modified on October 13, 2020 12:21 pm
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…
తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ…
ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…