మాళవిక మోహనన్.. చాలా ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు ఒక సెన్సేషన్. బాలీవుడ్లో దిశా పటాని తరహాలో హాట్ ఫొటో షూట్లతో ఈ మలయాళ అమ్మాయి కుర్ర కారును ఒక ఊపు ఊపేస్తూ ఉంటుంది. ‘మహర్షి’ సినిమాటోగ్రాఫర్ మోహనన్ తనయురాలైన మాళవిక.. స్టన్నింగ్ అందంతో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. ఈ భామ ఎప్పుడో టాలీవుడ్లో అడుగు పెట్టాల్సింది. విజయ్ దేవరకొండ సరసన ఆమె కథానాయికగా ‘హీరో’ అనే సినిమా మొదలై కొంత చిత్రీకరణ తర్వాత ఆగిపోయింది.
తర్వాత కొన్ని చిత్రాలకు కథానాయికగా తన పేరు వినిపించింది కానీ.. అవీ ఖరారవ్వలేదు. ఎట్టకేలకు ‘రాజా సాబ్’తో ఆమె వచ్చే ఏడాది డెబ్యూ చేయనుంది. ఐతే తాను ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలోనే నటించాల్సిందని మాళవిక తాజాగా వెల్లడించింది.‘సలార్’ సినిమాలో కథానాయిక పాత్రకు తనను దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్సిడర్ చేసినట్లు ఆమె వెల్లడించింది. తమ మధ్య సంప్రదింపులు కూడా జరిగాయని.. ‘బాహుబలి’ చూసి ప్రభాస్ ఫ్యాన్‌గా మారిన తాను తన టాలీవుడ్ డెబ్యూ విషయంలో అప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యానని మాళవిక చెప్పింది.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించలేకపోయినట్లు ఆమె తెలిపింది. ఐతే తర్వాత తనకు మారుతి ఫోన్ చేసి ‘రాజా సాబ్’ కోసం అడిగాడని.. ‘సలార్’లో మిస్సయినప్పటికీ, మళ్లీ ప్రభాస్ చిత్రంతోనే టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషించానని మాళవిక చెప్పింది.
ఈ సినిమాలో తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని.. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆమె తెలిపింది. వచ్చే ఏప్రిల్ 10కి అనుకున్న ఈ చిత్రం కొంత ఆలస్యం అయ్యేలా ఉంది. మే నెలాఖరులో విడుదల కావచ్చని భావిస్తున్నారు. రిలీజ్ డేట్ మీద అధికారిక ప్రకటన వచ్చేవరకు ఫ్యాన్స్ కి ఒక క్లారిటీ వచ్చేలా లేదు.
This post was last modified on December 30, 2024 4:23 pm
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…