ఇంకా షూటింగ్ మొదలుకాక ముందే అభిమానుల్లో విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కలిగిస్తున్న సినిమాల్లో చిరంజీవి – దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయిక ఒకటి. ప్రకటన స్టేజి నుంచే ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఓజి తరహాలో దీనిక్కూడా విపరీతమైన హైప్ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. న్యాచురల్ స్టార్ నాని సమర్పకుడిగా మారి నిర్మాణ వ్యవహారాల్లో భాగస్వామి కానుండటం బజ్ మరింత పెరిగేందుకు దోహదపడుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్టుని శ్రీకాంత్ ఓదెల నానితో ది ప్యారడైజ్ పూర్తి చేశాక షురూ చేయబోతున్నాడు. ఇంకో ఏడాది పట్టొచ్చు.
దీనికి సంబంధించి శ్రీకాంత్ ఓదెల మరోసారి ఓపెనయ్యాడు. ” నేను చిరంజీవిగారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పని చేయబోవడం నమ్మశక్యంగా లేదు. 48 గంటల్లో స్క్రిప్ట్ ఫైనల్ చేశాం. నాకైతే మబ్బుల్లో తేలుతున్నట్టు ఉంది. మా సినిమా గతంలో వచ్చినట్టుగా ఉండదు. మీరు వింటేజ్ మెగాస్టార్ ని చూడరు. ఒక ఫ్రెష్, వయసుకు తగ్గ అవతారంలో చూడబోతున్నారు. ఆయన క్యారవాన్ నుంచి బయటికి వచ్చేవరకు మాత్రమే నేను చిరు ఫ్యాన్. ఒక్కసారి వచ్చాక చిరంజీవిగారు నా సినిమాలో ఒక క్యారెక్టర్ గా మారిపోతారు”. చూశారుగా దసరా దర్శకుడి మాటల్లో ఎంత మెగా కాన్ఫిడెన్స్ ఉందో.
విశ్వంభర రిలీజయ్యాక చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడితో చేతులు కలపబోతున్నరు. ఇంకా అఫీషియల్ అనౌన్స్ చేయలేదు కానీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజయ్యాక దీనికి సంబంధించిన ప్రకటన రానుంది. ఇటు ఇది, అటు ప్యారడైజ్ రెండూ పూర్తయ్యాక చిరు – శ్రీకాంత్ సెట్స్ వైపు అడుగులు పడతాయి. చేతి నిండా రక్తంతో ప్రీ లుక్ పోస్టర్ తోనే టాక్ అఫ్ ది సోషల్ మీడియాగా మార్చేసిన ఈ కాంబో ఎలాంటి కథతో వస్తుందో చూడాలి. అన్నట్టు బయట వార్తల్లో వచ్చినట్టు ఇందులో నో హీరోయిన్, నో సాంగ్స్ లాంటివేవి లేవనే ప్రచారం ఉత్తుదేనని ఇన్ సైడ్ టాక్. అప్డేట్స్ కోసమైతే మరికొంత కాలం ఆగి చూడాలి.
This post was last modified on December 30, 2024 11:23 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…