ఈసారి సంక్రాంతికి రాబోయే చిత్రాల గురించి కొంచెం ముందుగానే క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’తో పాటు నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ పండక్కి ఖరారయ్యాయి. ఐతే వీటిలో బడ్జెట్, బిజినెస్ పరంగా ‘గేమ్ చేంజర్’ నంబర్ వన్ ప్లేసులో ఉంటే.. రెండో స్థానం ‘డాకు మహారాజ్’కు దక్కుతుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ది మూడవ స్థానంగా చెప్పొచ్చు.
కానీ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో, ప్రమోషన్లలో వెంకీ సినిమానే దూసుకెళ్తుండడం విశేషం. దాదాపు నెల రోజుల నుంచి నాన్ స్టాప్‌గా కంటెంట్ ఇస్తూ, ఏదో రకంగా ప్రమోషన్లు చేస్తూ టీం ఈ సినిమాను వార్తల్లో నిలబెడుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్.. హీరోయిన్లు ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి యాక్టివ్‌గా ప్రమోషన్లలో భాగం అవుతున్నారు. ‘గోదారి గట్టు మీద..’ పాట ఆల్రెడీ చార్ట్ బస్టర్ అయిపోయింది.
ఇప్పుడు వెంకీ స్వయంగా ఆలపించిన ‘పొంగల్ బ్లాక్బస్టర్’ సోషల్ మీడియాను ఊపేస్తోంది. మామూలుగా వెంకీ ప్రమోషన్లలో మరీ యాక్టివ్‌గా ఏమీ ఉండరు. ఆయన కొంచెం బిడియస్తుడు. ప్రి రిలీజ్ ఈవెంట్లో సందడి చేయడం, మీడియాతో చిట్ చాట్ నిర్వహించడం లాంటివి చేస్తారంతే. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ విషయంలో మాత్రం ఆయన చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరవుతున్నారు. అలాగే ప్రమోషనల్ వీడియోల్లోనూ భాగం అవుతున్నారు.
వెంకీ ఇంతగా ఏ సినిమాను ప్రమోట్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా తీయడంతో సరిపెట్టకుండా డిఫరెంట్‌గా, ఎంటర్టైనింగ్‌గా ప్రమోషన్లనూ ప్లాన్ చేస్తూ సినిమాకు చాలా మేలే చేస్తున్నారు. పండక్కి సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం వల్ల ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. మిగతా రెండు సంక్రాంతి చిత్రాలు ప్రమోషన్ల పరంగా బాగా వెనుకబడి ఉన్నాయనే చెప్పాలి. ఇకనైనా అవి జోరు పెంచాల్సిందే.
This post was last modified on December 29, 2024 9:15 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి…
2024.. మరో రెండు రోజుల్లో చరిత్రలో కలిసిపోనుంది. అయితే.. ఈ సంవత్సరం కొందరిని మురిపిస్తే.. మరింత మందికి గుణపాఠం చెప్పింది.…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్నటి వరకు జేజేలు కొట్టి.. జ్యోతులు పట్టిన చేతులే.. నేడు కనుమరుగు…
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి లేదు. ఆయన కుమారుడు, ఆయన కోడలు బ్రాహ్మణి…
2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు గొప్ప విజయాలతో పాటు కొన్ని నిరాశలకూ నిలిచింది. టీ20 వరల్డ్…