సంగీత దర్శకుడు తమన్ కు ఈ సంక్రాంతికి డబుల్ బొనాంజా పడింది. రెండు క్రేజీ సినిమాలు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ కు సంగీత దర్శకుడు కావడం వల్ల పెద్ద బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ముందొచ్చేది రామ్ చరణ్ మూవీ కాబట్టి దాంతో బ్లాక్ బస్టర్ బోణీ జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవలే యుఎస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ సెన్సాఫ్ హ్యూమర్ మాములుగా పేలలేదు. తనకు ఈ అవకాశం ఎలా వచ్చింది, శంకర్ తో అనుబంధం వగైరాలు సరదాగా వివరించిన తీరు నవ్వులు పూయించింది. తమన్ లో ఇంత కామెడీ యాంగిల్ ఉందని బయటపడింది ఈ వేడుకలోనే. తనేం చెప్పాడో చూద్దాం.
మూడేళ్ళ క్రితం వకీల్ సాబ్ కోసం మగువ మగువ పాటను కంపోజ్ చేస్తున్న తమన్ దగ్గరికి దిల్ రాజు వచ్చి నవ్వుతు నిలబడ్డారు. అయన ఎందుకలా ఎక్స్ ప్రెషన్లు ఇస్తున్నారో అర్థం కాని తమన్ రెండుమూడు సార్లు అడిగితే కానీ అర్థం కాలేదు. రికార్డింగ్ అవ్వగానే చెన్నై వెళ్లాలని, అక్కడ శంకర్ గారు ఎదురు చూస్తుంటారని దిల్ రాజు చెప్పడంతో ఒక్కసారిగా తమన్ కు షాక్ కొట్టినంత పనైంది. ఇరవై సంవత్సరాల క్రితం తనకు నటన రాదని తెలిసి కూడా బాయ్స్ లో వేషం ఇచ్చిన అభిమాన డైరెక్టర్ తో ఏకంగా పని చేయాల్సిన సందర్భమే రావడంతో తమన్ కు వెంటనే డైపర్ వేసుకోవాలన్నంత ఉద్వేగం కలిగింది.
విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా కిందకు దూకాలా లేక వెళ్లాలా అనేంత ఎగ్జైట్ మెంట్ వచ్చిందంటే తమన్ ఏ స్థాయిలో ఉద్వేగం చెందాడో అర్థం చేసుకోవచ్చు. రెహమాన్ కలయికలో శంకర్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ కి ధీటుగా పని చేశానని చెబుతున్న తమన్ సాంగ్స్ పరంగా పాస్ మార్కులు అయితే తెచ్చుకున్నాడు కానీ విజువల్ గా చూశాక పాటలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయని దిల్ రాజు అంటున్నారు. ఇవన్నీ తమన్ వేదిక మీద స్వయంగా చెప్పిన విశేషాలే. గతంలో నాయక్, బ్రూస్ లీ లాంటి సూపర్ హిట్స్ కి మ్యూజిక్ ఇచ్చిన తమన్ గేమ్ ఛేంజర్ కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తాడోనని ఫ్యాన్స్ వెయిటింగ్.
This post was last modified on December 29, 2024 2:20 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…