Movie News

బొబ్బిలి సింహంతో బొబ్బిలి రాజా కబుర్లు

కొన్ని క్రేజీ కలయికలు తెరమీద చూడాలని ఎంత బలంగా కోరుకున్నా జరగవు. ముఖ్యంగా మల్టీస్టారర్లు. అందుకే ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేతులు కలిపినప్పుడు అదో సెన్సేషన్ అయ్యింది. సీనియర్ హీరోల్లోనూ ఇలాంటి కాంబోలు రావాలని అభిమానులు ఎన్నోసార్లు అనుకున్నారు కానీ జరగలేదు. ఆ ముచ్చటని మరో రూపంలో అన్ స్టాపబుల్ టాక్ షో తీరుస్తోంది. తాజాగా బాలకృష్ణతో కబుర్లు పంచుకునేందుకు విక్టరీ వెంకటేష్ రావడంతో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. బయట ఈవెంట్లలో కలవడం సహజమే కానీ ఇలా గంటన్నరసేపు మాట్లాడుకోవడం ఏ సినిమాకూ తీసిపోలేదు.

ఈ సందర్భంగా వెంకటేష్ పలు కబుర్లు ప్రేక్షకుల కోసం పంచుకున్నారు. నాగచైతన్య చిన్నప్పుడు బొద్దుగా ఉండి హగ్ చేసుకునే జ్ఞాపకాలతో మొదలుపెట్టి వెంకీ మామ స్పెషల్ మెమరీగా ఎలా ఉండిపోయిందనేది చెప్పుకొచ్చారు. రానా, వెంకీ ఇద్దరు కుమార్తెలు, భార్య నీరజ, అన్నయ్య సురేష్ బాబు గురించి మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు హత్తుకునేలా సాగాయి. తండ్రి రామానాయుడు ప్రస్తావన వచ్చినప్పుడు ఎమోషనలైన వెంకటేష్ ఆయనని చూసే కుటుంబాన్ని, వృత్తిని బ్యాలన్స్ చేయడం నేర్చుకున్నానని చెప్పారు. పనిలో పనిగా సురేష్ బాబు కూడా అక్కడికి విచ్చేయడం మరింత కళను తీసుకొచ్చింది.

వెంకటేష్ డెబ్యూ కలియుగ పాండవుల ప్రస్తావన కూడా ఈ సందర్భంగా వచ్చింది. 1986 లో విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న టైంలో ఇండియాలో బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండేదని, కానీ నాన్న పిలుపుతో హీరో అయ్యానని గుర్తు చేసుకున్నారు. పరిశ్రమకు వచ్చే సమయానికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఫామ్ లో ఉండటాన్ని ప్రస్తావించారు. నలుగురిని నాలుగు స్తంభాలుగా చెప్పుకోవడం బాగుంది. టాక్ షో ప్రీ క్లైమాక్స్ లో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, దర్శకుడు అనిల్ రావిపూడి రావడంతో సందడి వాతావరణం పెరిగింది. మొత్తానికి బొబ్బిలి సింహంతో బొబ్బిలి రాజా కాంబో బుల్లితెరపై చూడముచ్చటగా సాగింది.

This post was last modified on December 28, 2024 10:18 pm

Share
Show comments

Recent Posts

సానియా – షమీ… అసలు మ్యాటర్ ఇదే

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డేటింగ్‌లో ఉన్నారన్న ప్రచారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీతో…

7 minutes ago

సెకండ్ హీరోయిన్లకు సూపర్ ఛాన్స్!!

సంక్రాంతికి విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ, డాకు మహారాజ్ లో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్లు…

35 minutes ago

సెంచరీ తరువాత అందుకే ఆ స్టిల్: నితీశ్‌ కుమార్‌ రెడ్డి

మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో, భారత యువ క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి తన అద్భుత ప్రతిభతో దేశాన్ని…

1 hour ago

విక్రమ్ తప్పుకున్నాడు…. చరణ్ వాడుకుంటాడు

2025 సంక్రాంతికి ఖరారుగా వస్తున్న సినిమాలు నాలుగు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం పక్కా ప్లానింగ్ తో…

14 hours ago

OG విన్నపం – ఫ్యాన్స్ సహకారం అవసరం!

పవన్ కళ్యాణ్ ఎంత పవర్ స్టార్ అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బాధ్యతతో కొన్ని కీలక శాఖలు నిర్వహిస్తూ నిత్యం…

16 hours ago

శంకర్ & సుకుమార్ చెప్పారంటే మాటలా

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగడం వల్ల వెంటనే లైవ్ చూసే అవకాశం అభిమానులకు లేకపోయింది. అక్కడ…

16 hours ago