సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి 28 రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంత ఆలస్యంగానా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ దేశంలో ఇతర బాషా చిత్రాలను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చాలా తతంగంతో పాటు స్క్రీన్ల అందుబాటు, సెన్సార్ నిబంధనలు తదితర వ్యవహారాలు చూసుకోవాలి. దానికి సరిపడా ప్లానింగ్ ని కనీసం మూడు నాలుగు నెలల ముందు నుంచే చేసుకోవాలి. దేవర నిర్మాతలు దాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవిని టార్గెట్ గా చేసుకున్నారు. వేలాది స్క్రీన్లలో జపాన్ ఆడియన్స్ దేవర దర్శనం చేసుకోబోతున్నారు.
ఇంట గెలిచిన దేవర రచ్చ గెలుస్తాడా అనేది ఆసక్తికరం. ఇప్పటిదాకా జపాన్ లో హయ్యెస్ట్ గ్రాసర్స్ గా నిలిచిన వాటిలో ఆర్ఆర్ఆర్, ముత్తు, బాహుబలి 2, త్రీ ఇడియట్స్, దంగల్, కెజిఎఫ్ 2 ఉన్నాయి. ఇటీవలే వెళ్లిన కల్కి 2898 ఏడి ఏమంత అద్భుతాలు చేయలేకపోయిందని ట్రేడ్ టాక్. ఇంకా ఫిగర్స్ రావాల్సి ఉంది. జపాన్ ప్రేక్షకులు సాధారణంగా ఎమోషన్లతో కూడిన హీరోయిజం ఎలివేషన్ కథలను బాగా ఇష్టపడతారు. పాటలు బాగుంటే అదొక బోనస్. ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ అయినవన్నీ మ్యూజికల్ హిట్సే. దేవరకి అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన సంగీతం వాళ్ళను మెప్పించే ఛాన్స్ లేకపోలేదు.
ఇంకా చాలా టైం ఉంది కాబట్టి జపాన్ కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు ప్లాన్ చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ హీరోల్లో ఒకడిగా జూనియర్ ఎన్టీఆర్ కు అక్కడ ఇమేజ్ ఉంది. ఇది దేవరకు ప్లస్ అవుతుంది. దాన్ని సరిగ్గా వాడుకుంటే కనక ఓపెనింగ్స్ బాగుంటాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు మొదలుపెడతారనేది తెలియదు కానీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. వార్ 2 పూర్తయ్యాక తారక్ వెంటనే ప్రశాంత్ నీల్ సెట్స్ లో అడుగు పెడతాడు. ఆ తర్వాత కానీ దేవర 2 ఉండే ఛాన్స్ లేదు. చూడాలి మరి ఏం నిర్ణయం తీసుకుంటారో.
This post was last modified on December 26, 2024 6:42 pm
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…