Movie News

పోలిశెట్టి టైమింగ్…రాజుగారి పెళ్లి!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్ రావడం వెనుక చిన్న యాక్సిడెంట్ లాంటి బలమైన కారణమున్నప్పటికీ ఎట్టకేలకు తన టైమింగ్ తో అలరించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న అనగనగా ఒక రోజు త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. నిజానికిది ఇప్పుడు ప్రకటించిన ప్రాజెక్టు కాదు. కొన్నేళ్ల క్రితం శ్రీలీల హీరోయిన్ గా మరో దర్శకుడితో అనౌన్స్ చేశారు. ఇతరత్రా కారణాల వల్ల ఆగిపోయి డైరెక్షన్ బాధ్యతలు మారి చేతికి వచ్చాక జోడిగా మీనాక్షి చౌదరిని తీసుకొచ్చారు. ఇవాళ టీజర్ వచ్చేసింది.

అంచనాలకు తగ్గట్టే నవీన్ పోలిశెట్టి కామెడీ మార్కుతో మూడు నిమిషాల వీడియోని కట్ చేశారు. రాజుగారి పెళ్లిలో కాజు కట్లీ కూడా బంగారం రేకుతో ఉండటం, ముఖేష్ అంబానీకి ఫోన్ చేసి అనంత్ మ్యారేజ్ కొచ్చిన సెలబ్రిటీలను ఇక్కడి సంగీత్ కు తీసుకురమ్మని చెప్పడం, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లో నవీన్, మీనాక్షి ఫోజులివ్వడానికి తంటాలు పడటం వగైరా అంతా ఫన్నీగా ఉంది. కథకు సంబంధించిన క్లూస్ ఇవ్వలేదు కానీ దర్పం, బిల్డప్ తో మిడిసిపడే ఒక సరదా కుర్రాడి జీవితం గురించని క్లూ ఇచ్చారు. చమ్మక్ చంద్ర తప్ప ఇతర ఆర్టిస్టులను రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు.

విడుదల తేదీ చెప్పలేదు కానీ 2025లో తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. జాతి రత్నాలు, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ తర్వాత స్పీడ్ పెంచుతాడనుకున్న నవీన్ పోలిశెట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అనగనగా ఒక రాజు మీద అంచనాలు ఏర్పడేలా జాగ్రత్తలు తీసుకున్న వైనం టీజర్ లో కనిపించింది. అఆ తర్వాత మిక్కీ జె మేయర్ సితార బ్యానర్ కు సంగీతం సమకూర్చడం విశేషం. మరి వేసవిలో వస్తాడా లేక అంతకన్నా ఆలస్యం చేస్తాడా అనేది వేచి చూడాలి. మీనాక్షి చౌదరికి అతి పెద్ద బ్లాక్ బస్టర్ లక్కీ భాస్కర్ ఇచ్చిన సితారలోనే ఇప్పుడు మరో అవకాశం దక్కడం అదృష్టమే. ఫలితం కూడా రిపీటవ్వాలి.

This post was last modified on December 26, 2024 1:08 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

45 minutes ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

7 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

10 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

11 hours ago