హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం లాంటి ఎన్నో క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం, కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు లాంటి సూపర్ హిట్స్ ని ఇండస్ట్రీకి అందించారు. బాలీవుడ్ లో చూసుకుంటే లెజెండరీ రాజ్ కపూర్ ఇచ్చిన ఆణిముత్యాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. ఇదే తరహాలో తాను కూడా డైరెక్షన్ లో ప్రూవ్ చేసుకుందామని నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న నటనానుభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో మోహన్ లాల్ మెగా ఫోన్ పట్టుకున్నారు.
బరోజ్ 3డిని భారీ ఎత్తున నిన్న మలయాళం, తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేశారు. నాలుగు వందల సంవత్సరాల క్రితం పోర్చుగీస్ రాజు డీగామా దాచి పెట్టిన బంగారు నిధిని కాపాడే బరోజ్ దాన్ని వారసులకు అందజేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పదమూడో తరానికి చెందిన గామా మనవరాలు ఇసబెల్లా గోవాకు వచ్చినప్పుడు బరోజ్ ఆమెను కలుస్తాడు. తర్వాత జరిగేది అసలు స్టోరీ. పాయింట్ పరంగా చూస్తే చందమామ కథలా అనిపించినా దాన్ని ఆసక్తికరంగా మలచడంలో మోహన్ లాల్ తడబడిన వైనం సాంకేతికంగా బలంగా ఉన్న కంటెంట్ ని బలహీనంగా మార్చింది. ఎలాంటి భావోద్వేగాలు ఉండవు.
బాహుబలిలో కట్టప్పని స్ఫూర్తిగా తీసుకుని బరోజ్ డిజైన్ చేశారు కానీ రాజమౌళి తరహాలో భావోద్వేగాలు, ఎలివేషన్లు పండించడంలో మోహన్ లాల్ విఫలమయ్యారు. పైగా హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉండాలని నేటివిటీని మిస్ చేయడంతో ఏదో ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కథనం మీద ఇంకా బాగా పని చేయాల్సింది. బాక్సాఫీస్ ఫలితం మలయాళంలో ఏమో కానీ ఇతర భాషల్లో మాత్రం సోసోగానే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బలమైన పోటీలో దిగిన బరోజ్ కు అటు కేరళలోనూ మార్కో రూపంలో పెద్ద పోటీ అడ్డుగా నిలుస్తుంది. ఈ లెక్కన లాల్ కష్టానికి తగ్గ రిజల్ట్ రావడం అనుమానంగానే ఉంది.
This post was last modified on December 26, 2024 9:58 am
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…