కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ని ఫ్యాన్స్ ఎంతగా స్వంతం చేసుకుని ఆదరించారో చూశాం. రిలీజ్ రోజు ఉదయం బెంగళూరుతో సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ల దగ్గర పెద్ద పెద్ద కటవుట్లు పెట్టి మరీ సంబరాలు జరుపుకున్నారు. దీని ప్రభావం ఎంతగా ఉందంటే యుఎస్ లో రెగ్యులర్ ఇంగ్లీష్ వెర్షన్ కు అదనంగా తెలుగు షోలు కూడా జోడించేలా వాల్ట్ డిస్నీ నిర్ణయం తీసుకుంది. రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీ ఎలాగూ విపరీతమైన ఆలస్యమవుతుందని ఇలా వివిధ రూపాల్లో తమ హీరోని చూసుకుని విని మురిసిపోతున్నారు.
ఇక్కడితో కథ అయిపోలేదు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గుంటూరు కారంని ఈ నెల 31న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా ఏడాది కాలేదు పైగా డివైడ్ టాక్ తో అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయిన ఈ సినిమాని నిజంగా చూస్తారనే డౌట్ డిస్ట్రిబ్యూటర్లలో ఉండే ఉంటుంది. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ హైదరాబాద్ లో సాయంత్రం వేసిన రెండు షోలు క్షణాల వ్యవధిలో సోల్డ్ అవుట్ అవ్వడమే కాక అదనంగా సుదర్శన్ తో పాటు దేవిలో కూడా షోలు వేయాల్సి వస్తోంది. మెల్లగా మిగిలిన ఏరియాల నుంచి కూడా ఎంక్వయిరీలు మొదలయ్యాయి. ఫైనల్ గా నమ్మశక్యం కాని నెంబర్లో షోలు పడొచ్చు.
ఇదంతా చూస్తే మహేష్ బాబు అభిమానులు ఇలా ఉన్నారేంటయ్యా అని అనిపించకమానదు. ఒకపక్క సై, హిట్లర్, ఓయ్, రఘువరన్ బిటెక్ లాంటి ఒకప్పటి బ్లాక్ బస్టర్ రీ రిలీజుల అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఉండగా గుంటూరు కారం మాత్రం హౌస్ ఫుల్స్ వారం ముందే నమోదు చేయడం విశేషం. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ మాస్ ఎంటర్ టైనర్ లో కుర్చీ మడతపెట్టి పాట, రవణగా మహేష్ బాడీ లాంగ్వేజ్ ఓ రేంజ్ లో పేలాయి. సోషల్ మీడియాలో అండర్ రేటెడ్ మూవీగా సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ ముందు ఎవరైనా దిగదుడుపే.
This post was last modified on December 26, 2024 9:52 am
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్కు…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అదికార కూటమి పూర్తిగా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. తనకు తానుగా ఏ…
టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చెప్పుకునే అర్జున్ రెడ్డికి సంగీత దర్శకుడు రధన్ ఇచ్చిన పాటలు ఎంత…
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలిగిపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ రోజు చాలా కీలకం. తెలుగులో కాకుండా…
ఆర్కే రోజా పేరు వింటేనే కూటమి పార్టీలు అంతెత్తున ఎగిరి పడుతున్నాయి. వైసీపీ అదికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలపై ఓ…
కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా…