మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాల తర్వాత బాగా నెమ్మదించిపోతుంది. మొదటి పది రోజుల్లోనే వసూళ్లు తెచ్చేసుకుని రిలాక్స్ అవుతుంది. కానీ పుష్ప 2 ది రూల్ అలా కనిపించడం లేదు. ఇరవై ఒకటో రోజు కూడా హౌస్ ఫుల్స్ నమోదు చేస్తూ సెలవు రోజుల్లో టికెట్లు దొరకని పరిస్థితి కల్పిస్తోంది. కొత్త రిలీజులు చాలా ఉన్నప్పటికీ వాటి ప్రభావం పుష్ప 2 మీద ఇనుమంతైనా లేదు. హిందీ వెర్షన్ సైతం దూకుడు మీద ఉంది. ఒక్క బాలీవుడ్ నుంచే 700 కోట్ల నెట్ దాటేసి మరో వంద కోట్లు జోడించుకునేందుకు పరుగులు పెడుతోంది. న్యూ ఇయర్ కి ఆ లాంఛనం జరగడం ఖాయం.
సంధ్య థియేటర్ ఘటన వల్ల మైత్రి టీమ్ ఎప్పటికప్పుడు వరల్డ్ వైడ్ ఫిగర్స్ ని ప్రకటించడం లేదు. అయినా సరే వసూళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 20, 25 తేదీల్లో రిలీజైన సినిమాలు దాదాపు టపా కట్టేసినట్టే. ఉపేంద్ర యుఐ కొంతలో కొంత నయమనిపించుకోగా విడుదల పార్ట్ 2, బచ్చల మల్లి, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, బరోజ్ ఏవీ కనీసం సరైన ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోయాయి. బాలీవుడ్ బేబీ జాన్ తేరి రీమేక్ కావడం వల్ల హైదరాబాద్ మినహాయించి మిగిలిన చోట్ల సోసో ఆక్యుపెన్సీతో మొదలయ్యింది. ఇదంతా పుష్ప 2కు సానుకూలంగా మారుతోంది.
ఈ లెక్కన జనవరి 10 గేమ్ ఛేంజర్ వచ్చే దాకా పుష్ప 2 ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుంది. సుదీప్ మ్యాక్స్, డ్రింకర్ సాయి లాంటివి ఎల్లుండి రిలీజవుతున్నా వాటి వల్ల ఏదో అద్భుతం జరిగిపోయే అవకాశం తక్కువ. బుక్ మై షోలో ఇప్పటిదాకా 18 మిలియన్ల టికెట్లకు పైగా అమ్ముడుపోయిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2 ఇప్పటికీ వీకెండ్స్ లో ఆన్ లైన్లో మూడు లక్షలకు పైగా టికెట్లు ముందస్తుగా అమ్ముతోంది. పైరసీ వల్ల ప్రభావితం చెందినా సరే బన్నీ ప్రభంజనం మాములుగా లేదు. చివరి టార్గెట్ అయిన రెండు వేల కోట్లను అందుకుంటుందా లేదానేది అభిమానులు ఎదురు చూస్తున్న కీలక ఘట్టం.
This post was last modified on December 25, 2024 6:57 pm
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…