Movie News

సూర్యకు సరైన రూటు వేసిన సుబ్బరాజ్!

కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా కంగువ మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సూర్యకి అది కోలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలవడం జీర్ణించుకోలేకపోయాడు. ఇతర భాషల్లో ఏమో కానీ తమిళంలోనూ కనీసం యావరేజ్ కాకపోవడం ఫ్యాన్స్ ఊహించని షాక్. సరే జరిగిందేదో జరిగిందని సర్దిచెప్పుకున్నారు కానీ నిజానికి గత కొన్నేళ్లుగా సూర్య సెలక్షన్ ఏమంత బాగాలేదు. కథలు, దర్శకుల ఎంపికలో చేస్తున్న తప్పుల వల్ల మార్కెట్ చేజేతులా దెబ్బ తింటోంది. ఎట్టకేలకు తన నుంచి అభిమానులు ఏది కోరుకుంటున్నారో దాన్నిచ్చే కాంబినేషన్ ని సూర్య ఎంచుకున్నాడు.

సూర్య, పేట ఫేమ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాకు రెట్రో టైటిల్ ఫిక్స్ చేశారు. ఇవాళ క్రిస్మస్ సందర్భంగా టీజర్ రిలీజయ్యింది. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పేశారు. పేరు మోసిన ఒక డాన్ కొడుకు తండ్రి మాఫియా వారసత్వాన్ని మోస్తూ హింస, రక్తపాతం మధ్య బ్రతుకుతూ ఉంటాడు. ఓ అందమైన అమ్మాయి పరిచయమయ్యాక ఆమె కోసం అన్నీ వదిలేసి ఒక మాములు మనిషిగా మారాలని నిర్ణయించుకుంటాడు. దాని కోసమే కొత్త జీవితాన్ని మొదలుపెడతాడు. అయితే నేరాలతో నిండిపోయిన గత చరిత్ర తాలూకు మరకలు వెంటాడుతూనే ఉంటాయి. అతనేం చేశాడనేది రెట్రో.

కథ పరంగా కొత్తదనం లేకపోయినా యాక్షన్ విజువల్స్, రెండు షేడ్స్ లో సూర్య వయొలెంట్ మాస్ అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఇంటెన్స్ టేకింగ్ తో ఆకట్టుకునే కార్తీక్ సుబ్బరాజ్ మరోసారి మేజిక్ చేసేలా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా వింటేజ్ సూర్యని బయటికి తీసిన విధానం కొత్తగా ఉంది. ఇలాంటివి సూర్య గతంలో చేశాడు కానీ రెట్రో మాత్రం అంచనాలు రేకెత్తించేలా ఉంది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేటయ్యింది. ఇవన్నీ ఒక ఎత్తయితే మంచి హోమ్లీ లుక్స్ లో అమాయకంగా కనిపించే పాత్రలో హీరోయిన్ పూజా హెగ్డే సరికొత్తగా దర్శనమిస్తోంది. 2025 వేసవిలో రెట్రో రిలీజ్ కానుంది.

This post was last modified on December 25, 2024 12:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago