జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ క్యాన్సర్ తో పోరాడుతూ ‘దేవర’ సినిమా చూడాలని ఉందని కోరిన వీడియో గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడిన తారక్…కౌశిక్ చికిత్సకు సాయం చేస్తానని మాటిచ్చారు. అయితే, ఆ తర్వాత ఎన్టీఆర్ తమకు ఏ సాయం చేయలేదని, తారక్ అభిమానులు మాత్రం రెండున్నర లక్షలు ఇచ్చారని కౌశిక్ తల్లి సరస్వతి నిన్న చేసిన ఆరోపణలు దుమారం రేపాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా తారక్ టీం ఆస్పత్రి పెండింగ్ బిల్లు చెల్లించడంతో కౌశిక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలో అపోలో చికిత్స నిమిత్తం ఏపీ ప్రభుత్వం రూ.11 లక్షలు, టీటీడీ నుంచి రూ.40 లక్షలు ఆర్థిక సాయం అందిందని చెప్పారు సరస్వతి. ఇంకా, రూ. 20 లక్షలు కట్టాలని ఆసుపత్రి యాజమాన్యం అడుగుతోందని, తమను ఆదుకోవాలని కోరారు.
జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ సంప్రదించేందుకు, సోషల్ మీడియా ద్వారా ఆయనకు సందేశం పంపడం తమకు తెలియలేదని చెప్పారు. అయితే, ఈ విషయంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పందించారు. కౌశిక్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నామని, వారి కుటుంబంతో టచ్ లో ఉన్నామని అన్నారు. ఈ క్రమంలోనే హాస్పిటల్ కి వెళ్లి కౌశిక్ చికిత్స తాలూకు పెండింగ్ బిల్స్ ను తారక్ టీం క్లియర్ చేసినట్లు తెెలుస్తోంది. బిల్ సెటిల్డ్ అంటూ తారక్ ఫ్యాన్ ఒకరు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కౌశిక్ ఇష్యూ ద్వారా తారక్ పై కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని కొందరు ట్రై చేశారని, వారు ఇక విశ్రాంతి తీసుకోవచ్చని తారక్ ప్యాన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అభిమానులను ఆదుకోవడంలో తారక్ ఎప్పుడూ ముందే ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా వివాదానికి తావు లేకుండా ఈ ఇష్యూ సాల్వ్ అయిందని, ఇందులో ఎవరి తప్పు లేదని నెటిజన్లు అంటున్నారు.
This post was last modified on December 24, 2024 7:41 pm
భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు…
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద…
రాజకీయ నేతలు నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగిపోతూ ఉంటారు. ఇక అధికారంలో ఉన్న పార్టీల నేతలైతే.. క్షణం తీరిక…
భారత గణతంత్ర దినోత్సవం నాడు ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ నేతల ఓ కీలక సమావేశం జరిగింది. పార్టీలో క్రియాశీలక…
మూడేళ్ళ క్రితం చిరంజీవి గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో…