Movie News

కొత్త సంవత్సరానికి పాత సినిమాల స్వాగతం!

ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక చెప్పుకోదగ్గ కొత్త రిలీజు ఉండేది. కానీ సంక్రాంతి కామధేనువుగా మారాక ఈ డేట్ ని నిర్మాతలు లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే 2025 ఓపెనింగ్ ఈసారి పాత సినిమాలతో మొదలుకానుంది. 1997లో చిరంజీవి కంబ్యాక్ గా నిలిచిన బ్లాక్ బస్టర్ ‘హిట్లర్’ని పాతిక సంవత్సరాల తర్వాత థియేటర్లకు తీసుకొస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇది శాటిలైట్ ఛానల్స్ లో రావడం లేదు. యూట్యూబ్ లో అఫీషియల్ గా అందుబాటులో లేదు. సో భారీ స్పందన వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.

ముఖ్యంగా అయిదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు పండించిన సెంటిమెంట్, అబ్బీబీ పాటకు డాన్స్ లాంటి ఆకర్షణలు వింటేజ్ ఫ్యాన్స్ ని ఆకర్షించే అవకాశం లేకపోలేదు. రాజమౌళి నితిన్ కాంబోలో వచ్చిన ‘సై’ని మరోసారి బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ చేయించబోతున్నారు. ప్యాన్ ఇండియా మూవీస్ మొదలుపెట్టక ముందు జక్కన్న తీసిన సూపర్ హిట్ ఇది. తెలుగోళ్లకు అసలు అలవాటే లేని రగ్బీ ఆట బ్యాక్ డ్రాప్ లో అంత కన్విన్సింగ్ గా తీయడం ఆయనకే చెల్లింది. ఆల్రెడీ ఒకసారి రీ రిలీజ్ జరుపుకుని మంచి కలెక్షన్లు దక్కించుకున్న సిద్దార్థ్ ‘ఓయ్’ మరోసారి పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.

జనవరి 4 ధనుష్ ‘రఘువరన్ బిటెక్’ వస్తోంది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ యూత్ ఫుల్ మూవీ హాళ్లను మ్యూజిక్ కన్సర్ట్ గా మార్చడం ఖాయం. జనవరి 10 గేమ్ ఛేంజర్ వచ్చేదాకా చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడంతో నిర్మాతలు వీటిని తీసుకొస్తున్నారు. క్రిస్మస్ కొత్త సినిమాలు ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాలు ఇవ్వలేకపోవడంతో పాతవైనా ఫీడింగ్ కి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎగ్జిబిటర్లున్నారు. రెండు మూడు నెలలుగా రీ రిలీజులకు ఆదరణ తగ్గిన నేపథ్యంలో ఎలాగూ సరిపడా స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ ట్రెండ్ కి ఊపొచ్చేలా ఇవేమైనా వర్కౌట్ అవుతాయేమో చూడాలి.

This post was last modified on December 24, 2024 5:26 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

42 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

50 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago