మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి వాతావరణాన్ని తీసుకొచ్చింది. అయితే యునానిమస్ టాక్ దేనికీ రాకపోవడం విచారమే అయినా వీటితో పాటు ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీని థియేటర్లకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే పరిమిత స్క్రీన్లలో విడుదల చేయడం వల్ల ఎక్కువ శాతం ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. అయినా ఓటిటిలో పెట్టాల్సిన కంటెంట్ ని రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి చూస్తారా అనే కామెంట్స్ రాకపోలేదు. ప్రమోషన్ పెద్దగా చేయలేదు.
వీటి సంగతి ఎలా ఉన్నా 1 గంట 40 నిమిషాల ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఫ్యాన్స్ కి పైసా వసూల్ అనిపించేలా ఉంది. ఎందుకంటే చరణ్ ఇంట్రోలో వేలాది మందిని పోగేసి తీసిన పోలీస్ స్టేషన్ ఫైట్, పులితో తలపడే తారక్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బాంగ్ లో జంతువులను ట్రక్కు నుంచి దూసుకొచ్చే ఘట్టం, నాటు నాటు పాట వెనుక కష్టాలు, క్లైమాక్స్ ని గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసిన విధానం, పనిచేసిన వాళ్ళ ఇంటర్వ్యూలు ఇలా బోలెడు విశేషాలను ఇందులో పొందుపరిచారు. ఇప్పటిదాకా చూడని అరుదైన ఫుటేజ్, విజువల్స్, ఆన్ సెట్స్ వీడియోలు దీంట్లో రివీల్ చేశారు.
సంతృప్తి పరిచింది కానీ ఇలాంటివి థియేటర్ కు వెళ్లి మరీ చూసేంత ఆసక్తి అందరికీ ఉండదనే ఉద్దేశంతో లిమిటెడ్ స్క్రీన్స్ కాన్సెప్ట్ పెట్టుకున్నారు. అందుకే దీనికొచ్చే వసూళ్ల గురించి ఎక్కడా ప్రస్తావన ఉండబోదు. ఈ డాక్యుమెంటరీని త్వరగా ఓటిటిలోకి వదిలితే బ్లాక్ బస్టర్ అవ్వొచ్చు. ఎందుకంటే చరణ్, తారక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అన్ సీన్ (ఇప్పటిదాకా చూడని) కంటెంట్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. అది ఒక పరిధి వరకు నెరవేరిందనే చెప్పాలి. అయినా మహేష్ బాబు 29 ఎప్పుడు మొదలుపెడతారాని ఎదురు చూస్తుంటే ఇంకా ఆర్ఆర్ఆర్ హ్యాంగోవర్ ఏమిటి స్వామి అనేది సూపర్ స్టార్ ఫ్యాన్స్ ప్రశ్న.
This post was last modified on December 23, 2024 9:21 am
ఏపీలోని గిరిజన గూడేలకు రోడ్డు సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన అడవి తల్లి బాట కార్యక్రమాన్ని జనసేన అధినేత, ఏపీ…
తెలుగమ్మాయిలకు తెలుగులో ఆశించిన అవకాశాలు రావు కానీ.. వాళ్లు వేరే భాషల్లోకి వెళ్లి సత్తా చాటుతుంటారు. అంజలి, ఆనంది, శ్రీదివ్య,…
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్లు ఒక్కొక్కరుగా సౌత్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు దర్శకులకు అక్కడ మాంచి డిమాండ్ ఏర్పడింది.…
ఏపీలో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిన సంగతి తెలిసిందే.…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో నేచురల్ స్టార్ నాని ఊపు మామూలుగా లేదు. ఇటు హీరోగా వరుస హిట్లు కొడుతున్నాడు. అటు నిర్మాతగానూ…
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జిల్లా కేంద్రానికి వెళుతున్న డిప్యూటీ…