Movie News

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే చర్చించుకునేలా మారింది. జరిగింది ఘోరం. ఎవరూ కాదనలేరు. అలా అని ఎవరో జరగాలని కోరుకున్నది కాదు. కానీ అల్లు అర్జున్ వైపే అన్ని వేళ్ళు ఉండేలా ప్రభుత్వం, పోలీసులు కేసుని నడిపించిన తీరు అన్ని వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తొలుత అరెస్ట్ కావడం, ఆ తర్వాత బెయిల్ రావడం, పరామర్శకు టాలీవుడ్ ప్రముఖులు క్యూ కట్టడం, అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి ఫైర్, ప్రతిగా బన్నీ ప్రెస్ మీట్, నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళ దాడి ఇలా ఎన్నో పరిణామాలు జరిగాయి.

పోలీసులు చాలా బలమైన సాక్ష్యాలు సేకరించి అల్లు అర్జున్ డిఫెన్స్ లో పడేలా వీడియోలు విడుదల చేస్తున్నారు. ఒక మహిళా ప్రాణం పోయి, ఓ పిల్లాడు ఆసుపత్రిలో స్పృహలో లేకుండా చికిత్స తీసుకుంటున్నాడు. ఇది అందరూ బాధ పడే సంఘటన. తెలిసో తెలియక బన్నీ డిసెంబర్ 4 రాత్రి వ్యవహరించిన తీరులో తప్పులున్నాయన్నది కొందరి ఉద్దేశం. అలాని నేరుగా తనే బాద్యుడు అనేందుకు కూడా లేదు. పరోక్షంగా కారణమైన వాస్తవాన్ని విస్మరించలేం. కానీ ఇంతకన్నా తీవ్రంగా ఉన్న నేరాల పట్ల కూడా ఇదే స్పందన ఉండాలనేది సామాన్యుల వాదన. ఈ ఒక్క పాయింట్ మాత్రం అల్లు అర్జున్ కు అనుకూలంగా మారుతోంది.

పుష్ప 2 ది రూల్ మూడో వారంలోనూ వసూళ్ల దుమ్ము దులుపుతోంది. కానీ ఆ ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం బన్నీకి లేకుండా పోయింది. సక్సెస్ మీట్లు చేసుకునే సందర్భం కాదు కానీ ఏ హీరో కెరీర్ కైనా ఇలాంటి పాత్ బ్రేకింగ్ మూవీ ప్రతిసారి రాదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆ విషయమే పూర్తిగా కనుమరుగైపోయేలా అల్లు అర్జున్ కోర్టు కేసులు, ఆరోపణలకు వివరణలు, మీడియా నుంచి వస్తున్న ఒత్తిళ్లు, లాయర్లతో చర్చలు ఇలా రకరకాల వ్యూహాల్లో చిక్కుకుపోయాడు. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది పక్కనపెడితే అవసరానికి మించిన టార్గెట్ బన్నీ అయ్యాడనేది మాత్రం కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం.

ఏకంగా ఇంటిమీదకు రాళ్లదాడి దాకా వ్యవహారం వెళ్లిందంటే కుట్ర కోణం ఉందేమోననే అనుమానాలు బలపడుతున్నాయి. ఎవరు నేరం చేసినా శిక్షించడానికి కోర్టులున్నాయి. చట్టాలున్నాయి. గతంలో ప్రధానమంత్రిని చంపిన వాళ్ళకే శిక్ష అమలు చేయడానికి సంవత్సరాలు పట్టిన వ్యవస్థ మనది. అలాంటిది ఇలాంటి దారుణం ఎవరూ చేయలేదు, ఎప్పుడూ జరగలేదు అనే స్థాయిలో తీవ్రంగా ప్రొజెక్ట్ కావడం మాత్రం విచిత్రం. ఇదేదో అల్లు అర్జున్ ని వెనకేసుకొచ్చే వ్యవహారం కాదు. సామాన్య జనం కావొచ్చు సోషల్ మీడియా కావొచ్చు. ప్రతిదీ శల్యపరీక్షకు గురయ్యే పరిస్థితుల్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది కాలమే.

Kumar

Recent Posts

వివాదాలు ఎన్ని ఉన్నా అవకాశాలకు లోటు లేదు

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…

1 hour ago

టాక్సిక్ ఫిక్సు… పోటీ సినిమాలకు చిక్కు

అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…

2 hours ago

సీఐ నాగ‌రాజుకు మహిళల మద్దతు

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేషన్ సీఐ నాగ‌రాజుపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించి.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే..…

3 hours ago

హీరోయిన్ల కలెక్షన్లతో ఫ్యాన్ వార్స్ ఏంటయ్యా…

టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…

3 hours ago

‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

3 hours ago

థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి

ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…

4 hours ago