పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా దీని ప్రస్తావన తేకుండా ఉండలేకపోతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు పలుమార్లు ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల ఓజి ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది. నిన్న అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్, తమన్ కు సైతం ఇది తప్పలేదు. ఒకవేళ తాను కనక సంక్రాంతికి రాకపోయి ఉంటే కళ్యాణ్ బాబాయ్ ని ఒప్పించి ఎలాగైనా ఓజి రిలీజయ్యేలా చూసేవాడినని చెప్పడంతో ఒక్కసారిగా స్టేడియం ఈలలతో హోరెత్తిపోయింది.
తమన్ ప్రసంగం మొదలుకాగానే వేరేది వినిపించనంత హోరులో ఎన్ఆర్ఐలు ఉక్కిరిబిక్కిరి చేశారు. ముందు గేమ్ ఛేంజర్ లో ఓజిని చూద్దామని ఆ తర్వాత మీ కోరిక నెరవేరుతుందని చెప్పిన తమన్ గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రోకు ఏం చేశానో తెలుసుగా ఈసారి అంతకు మించి చూస్తారనేలా హింట్ ఇవ్వడం మాములు కిక్ ఇవ్వలేదు. ఇండియన్ హిస్టరీని తిరగరాసే స్థాయిలో ఓజి ఉంటుందని చెప్పిన తమన్ ఈవెంట్ కొచ్చిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కావలసిన జోష్ అయితే ఇచ్చాడు. ఎస్ జే సూర్య మాట్లాడేటప్పుడు పవన్ పేరు ఎత్తగానే ఓ రెండు మూడు నిమిషాల పాటు ఏ సౌండ్ వినిపించనంత అల్లరి రేగింది.
దీన్ని బట్టే ఓజి ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ఇంకా పవన్ ఎంటర్ కాలేదు. ప్రస్తుతం హీరో లేని సన్నివేశాలు, పాటను బ్యాంకాక్ లో పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఓజి కన్నా ముందు హరిహర వీరమల్లు రిలీజవుతుందని తెలిసినా కూడా ఫ్యాన్స్ మాత్రం తమ ఛాయస్ ఏంటో పలు సందర్భాల్లో చెబుతూనే వస్తున్నారు. ఎలా చూసుకున్నా 2025 దీపావళి కన్నా ముందు ఓజి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ అంతకన్నా ఆలస్యమైతే మాత్రం 2026 సంక్రాంతి బరిలో దింపుతారు. అప్పుడు ఎన్టీఆర్ నీల్ తో పాటు పోటీ రసవత్తరంగా మారుతుంది.
This post was last modified on December 23, 2024 8:41 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…