Movie News

ఫ్యాన్స్ కోరుకున్న ‘ధోప్’ స్టెప్పులు ఇవే చరణ్!

ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి అమెరికాలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతున్న ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన నిర్మాత దిల్ రాజు ఊహించిన దానికన్నా చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన వైనం వీడియోల రూపంలో ఎక్స్ మొత్తం తిరుగుతోంది. వేడుక సందర్భంగా ఇవాళ ధోప్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు తమన్ దీని గురించి కొన్ని వారాలుగా ఫ్యాన్స్ ని తెగ ఊరిస్తున్నాడు. బెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్ గా అభిమానులు మాములు అంచనాలు పెట్టుకోలేదు.

పాట విషయానికి వస్తే స్లో మెలోడీలో హుషారైన బీట్స్ కంపోజ్ చేసిన తమన్ ఒక వెరైటీ అనుభూతి అయితే కలిగించాడు. వెంటనే మళ్ళీ మళ్ళీ వినాలనిపించిందనే ఎక్సైట్మెంట్ ని ఫ్యాన్స్ కి ఇస్తుందో లేదు వేచి చూడాలి. వీడియోలో ఆకట్టుకున్న ప్రధానమైన అంశం రామ్ చరణ్ స్టెప్పులు. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు తప్ప వేరే డాన్స్ చేసే అవకాశం రాజమౌళి ఇవ్వలేదు. ఆచార్యలోనూ పెద్దగా స్కోప్ దక్కలేదు తండ్రితో కలిసి కాలు కదపడం తప్ప. కానీ గేమ్ ఛేంజర్ లో మాత్రం శంకర్ ఫుల్ గా వాడుకున్న వైనం కనిపిస్తోంది. ముఖ్యంగా సింగల్ టేక్ లో అరనిమిషం పైగా ఉన్న రెండు క్లిప్స్ అప్పుడే విపరీతమైన రీచ్ తెచ్చుకుంటున్నాయి.

ఇప్పటిదాకా వచ్చిన నాలుగు పాటల్లో దీని స్థానం ఏమిటనేది మ్యూజిక్ లవర్స్ డిసైడ్ చేస్తారు కానీ దర్శకుడు శంకర్ నుంచి ఆశించిన గ్రాండియర్ మాత్రం ప్రతిపాటలోనూ కనిపిస్తోంది. చరణ్ లుక్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, కియారా అద్వాని గ్లామర్ అన్ని బాగా మిక్స్ అయ్యాయి. తమన్ చెప్పినంత స్థాయిలో ఈ దోప్ అనేది స్లో పాయిజన్ లా ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి. జనవరి 10 రిలీజవుతున్న గేమ్ ఛేంజర్ కోసం ఏపీ, తెలంగాణలో భారీ ఎత్తున థియేటర్లకు సిద్ధం చేస్తున్నారు దిల్ రాజు. పోటీ సినిమాల కంటే రెండు రోజులు ముందే రావడం ఓపెనింగ్స్ పరంగా చాలా పెద్ద ప్లస్ కానుంది. సో కౌంట్ డౌన్ స్టార్ట్.

This post was last modified on December 22, 2024 11:44 am

Share

Recent Posts

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

5 hours ago

బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…

6 hours ago

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

7 hours ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

8 hours ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

8 hours ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

9 hours ago