పెద్ద సినిమాల వరకు సూపర్‍స్టార్ స్టేటస్ వున్న హీరోనే కెప్టెన్. రాజమౌళి మినహా మరెవరికీ హీరోని ధిక్కరించడం కానీ, శాసించడం కానీ కుదరదు. బడా స్టార్ ఏమనుకుంటే అదే జరుగుతుంది. నిర్మాత అయినా, దర్శకుడు అయినా అతనేం చెబితే అది చేయాల్సిందే. ‘సర్కారు వారి పాట’ సినిమా చేయడానికి అంగీకరించిన మహేష్‍కి ఈలోగా త్రివిక్రమ్‍తో సినిమా చేసే ఛాన్సుందనిపించింది.
ఎన్టీఆర్‍తో సినిమా ఖాయం చేసుకున్న త్రివిక్రమ్‍కి ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఆ సినిమా లేట్ అయ్యేట్టయితే మహేష్‍తో సినిమా చేసేద్దామనే ఐడియాతో త్రివిక్రమ్ వున్నాడు. ఈ సంకేతాలు అందడంతో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ త్వరగా మొదలు పెట్టేయడానికి మైత్రి మూవీస్ సన్నాహాలు చేసుకున్నారు.
నవంబరులో అమెరికాలో ఒక షెడ్యూల్ చేద్దామని ప్లాన్ చేసారు. అక్కడకి లొకేషన్ రెక్కీ కోసం వెళ్లిన పరశురాం ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో షూటింగ్ అంత ఈజీ కాదని తెలుసుకున్నాడు. దీంతో షూటింగ్ జనవరికి వాయిదా పడింది. ఈలోగా మహేష్ కానీ త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టేస్తాడేమోననే భయం, కంగారు ‘సర్కారు’ యూనిట్లో నెలకొంది. వారి భయాన్ని మరింత పెంచుతూ త్రివిక్రమ్‍తో అతి త్వరలో సినిమా చేస్తున్నట్టు మహేష్ ట్వీట్ కూడా పెట్టేసాడు.
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…