ఇవాళ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ పెద్ద బాంబు వేసింది. సంధ్య థియేటర్ ఉదంతం గురించి జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద తీవ్ర విమర్శలు చేయడంతో పాటు పరామర్శకు వెళ్లిన ఇండస్ట్రీ మీద సైతం ఘాటు కామెంట్స్ చేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఇకపై ఎలాంటి టికెట్ రేట్ల హైక్స్, బెనిఫిట్ షోల అనుమతులు ఉండవని సీఎంతో పాటు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించడంతో ఒక్కసారిగా పరిశ్రమ షాక్ అయ్యింది. దీని పరిణామాలు మాములుగా ఉండవు.
పుష్ప 2 ది రూల్ తర్వాత రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. నైజామ్ లో టికెట్ రేట్ల పెంపు లేకపోతే రెవిన్యూ బాగా ప్రభావితం చెందుతుంది. పైగా స్పెషల్ షోలు లేవంటే అదో పెద్ద లాస్. అసలే సంక్రాంతి సీజన్. హైదరాబాద్ జనాలు అధిక శాతం స్వంత ఊళ్లకు వెళ్ళిపోతారు. మిగిలినవాళ్లకు ప్రీమియర్లు లేవంటే దాని ఎఫెక్ట్ ఓపెనింగ్స్ మీద పడుతుంది. ఎందుకంటే రాత్రి సినిమా చూసేస్తే ఉదయం డ్యూటీలు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళెక్కువ. కానీ ఇప్పుడా జనాలు డైవర్ట్ అవుతారు. అసలే దిల్ రాజు దీని మీద మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారని టాక్. ప్రమోషన్లు కూడా ఆ స్థాయిలో చేస్తున్నారు.
సో దిల్ రాజు ఎంత తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్ మెన్ అయినా ప్రభుత్వ అంగీకారం లేకుండా తన సినిమాకైనా సరే వెసులుబాట్లు తెచ్చుకోలేరు. రాబోయే 2025 ప్రారంభంలో గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు హరిహర వీరమల్లు, విశ్వంభర, మిరాయ్, ది రాజా సాబ్ లాంటి చాలా ప్యాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టాయి. ఒకవేళ కాంగ్రెస్ సర్కారు తమ పాలనలో వెసులుబాట్ల ప్రసక్తే ఉండదనే మాటకు కట్టుబడితే అందరికీ చిక్కులు తప్పదు. ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్ లో సమస్య లేదు కాబట్టి అక్కడ రేట్లు, షోలు కొనసాగుతాయి కాబట్టి. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కనక కొంత కాలం బెనిఫిట్స్ మర్చిపోవడం ఉత్తమం.
This post was last modified on December 21, 2024 5:19 pm
మాస్ రాజా రవితేజ సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. కరోనా కాలంలో వచ్చిన క్రాక్ మూవీనే రవితేజకు…
రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక…
థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…