ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన పుష్ప… 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను టార్గెట్ చేశాడు. అయితే, మరికొద్ది రోజుల్లో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రచారాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఖండించింది. పుష్ప-2 చిత్రం ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదని, 56 రోజుల తర్వాత మాత్రమే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడగలరని క్లారిటీనిచ్చారు.
పుష్ప-2 వంటి పాన్ ఇండియా మూవీని ఈ హాలిడే సీజన్ లో థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని చెప్పారు. వరల్డ్ వైడ్ థియేటర్లలో పుష్ప వైల్డ్ ఫైర్ రాజుకుందని, కేవలం థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అంటున్నారు. పీలింగ్స్, కిస్సిక్ పాటల ఫుల్ వీడియో సాంగ్స్ రిలీజ్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా ఆ వార్త నిజమే అనుకున్నారు.
సాధారణంగా చిత్రం ఓటీటీలో విడుదల కావడానికి ముందు యూట్యూబ్లో రిలీజ్ అవుతుంటాయి. దీంతో పుష్ప-2 ఓటిటి రిలీజ్ డేట్ త్వరలోనే ఉంది అనే వాదనకు బలం చేకూరినట్లు అయింది. ఈ నేపథ్యంలోనే ఆ పుకార్లను మైత్రి మూవీ మేకర్స్ ఖండించారు. మైత్రి మూవీ మేకర్స్ తాజా ప్రకటనతో ఆ రూమర్లకు చెక్ పడ్డట్లయింది. కాబట్టి పుష్ప గాడి రూల్ ఇప్పట్లో ఇంటికి వచ్చేలా లేదు కాబట్టి సినిమా ని కేవలం ధియేటర్ లోనే చూడక తప్పదు.
కాబట్టి మరో నెల రోజుల పాటు పుష్ప గాడి రూల్ థియేటర్ లోనే బ్లాస్ట్ అవుతుందని తెలియడంతో 2000 కోట్ల మార్క్ ను పుష్ప 2 దాటేస్తుందని ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఆ రికార్డు బద్దలవుతుందో లేదో.
This post was last modified on December 20, 2024 8:40 pm
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…