నిన్న రాత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్న పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో పుష్ప 2 ది రూల్ బుకింగ్స్ తీసేయడం సంచలనమయ్యింది. ఇవాళ ఉదయం నుంచి తిరిగి కొనసాగించారు కానీ ఆ కొన్నిగంటలు మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ఎందుకంటే పదిహేను వందల కోట్ల గ్రాస్ దాటి రెండు వేల మైలురాయి వైపు పరుగులు పెడుతున్న తరుణంలో ఇలా జరగడం వసూళ్ల పరంగా పెద్ద దెబ్బ కొడుతుంది. పైగా ఉత్తరాది రాష్ట్రాల్లో పివిఆర్ తో పాటు మిరాజ్ సినిమాస్ కీలక థియేటర్ చైన్. ఈ ఇద్దరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. పరిష్కారం అయ్యింది కానీ అసలేం జరిగిందో చూద్దాం.
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం పుష్ప 2 ది రూల్ హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అనిల్ తదాని మూడో వారంలోనూ పెద్ద సంఖ్యలో స్క్రీన్లు కావాలని కోరుకున్నారు. డిసెంబర్ 25 బేబీ జాన్ రిలీజవుతున్నా సరే దాంతో సమానంగా యాభై శాతం థియేటర్లు పంచేలా వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు అగ్రిమెంట్ అడిగారట. ఇలా అయితే వరుణ్ ధావన్ మూవీకి రెండు రోజులు పెద్ద దెబ్బ పడుతుంది. దాంతో డిస్ట్రిబ్యూటర్లు ససేమిరా అన్నారు. ముఖ్యంగా పివిఆర్ కు ఈ కండీషన్ అభ్యంతరకరంగా అనిపించింది. దీంతో పలు దఫాల చర్చలు, మంతనాలు అవసరమయ్యాయి.
ఎట్టకేలకు కథ క్లైమాక్స్ కు చేరుకుంది కానీ పుష్ప 2 ప్రకంపనలు నార్త్ లో ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలేమో. వీకెండ్స్ లో మరోసారి పుంజుకునేలా కనిపిస్తున్న పుష్పరాజ్ వీలైనంత త్వరగా నెమ్మదించకపోతే బేబీ జాన్ కు ఇబ్బంది తప్పదు. తేరి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది కనక హిట్టయితే ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ మార్పులను వాడుకునే అవకాశం లేకపోలేదు. దేశవ్యాప్తంగా బేబీ జాన్ కు పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా హిందీలో వస్తున్న చిత్రం ఇదొక్కటే.
This post was last modified on December 20, 2024 9:37 am
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……