రీల్ విలన్‌గా ఉన్న సోనూ సూద్.. కరోనా-లాక్‌డౌన్ టైంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. అతడి ప్రతి మాటా, ప్రతి చర్యా ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా అతను చేసిన ఒక ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్లో అతను వేసిన పంచ్ భారత కుబేరుడు ముకేష్ అంబానీకి తగలడం విశేషం. కరోనా టైంలో ధనవంతులు మరింత ధనవంతులుగా మారారని.. పేదవాళ్లు మరింత పేదవాళ్లు అయ్యారని తన ట్వీట్లో పేర్కొన్నాడు సోనూ.
కరోనా-లాక్‌డౌన్‌తో అత్యధికంగా ప్రభావితం అయింది కింది స్థాయి వాళ్లే. రోజువారీ ఆదాయంతో బతికే వాళ్లలో చాలామందికి నెలల తరబడి ఉపాధి పోయింది. పేద, మధ్యతరగతి జీవులు లాక్‌డౌన్ టైంలో అల్లాడిపోయారు. వారి కష్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కోట్లాది మంది ఆర్థిక పరిస్థితి తల్లకిందులైంది.
కానీ ఇదే సమయంలో ముకేష్ అంబాని సహా కొందరు కుబేరుల సంపద అమాంతం పెరిగింది. ఈ ఏడాది ఆరంభానికి ముందు ముకేష్ అంబాని సంపద 59 బిలియన్ డాలర్లుగా ఉండగా.. కరోనా అన్ని రంగాలనూ కుదేలు చేసిన కొత్త ఏడాదిలో ముకేష్ సంపద అనూహ్యంగా పెరిగింది. 22 బిలియన్ డాలర్ల వృద్ధితో ఆయన సంపద 79.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయన ఆధ్వర్యంలోని జియో సంస్థలోకి కరోనా టైంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఆయన సంపదను అమాంతం పెంచాయి.
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ దెబ్బకు అల్లాడిపోయిన కింది స్థాయి వర్గాలకు పెద్దగా చేసిందేమీ లేదు కానీ.. కార్పొరేట్లను మాత్రం తమ పాలసీలతో బాగా ఆదుకుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సోనూ సూద్.. అంబాని లాంటి కుబేరులకు గట్టిగా తగిలేలా ట్విట్టర్లో పంచ్ వేశాడు. అతడి ట్వీట్‌కు నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది.
This post was last modified on October 11, 2020 10:04 am
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…