డేటింగ్ రూమర్స్‌పై VD మరో క్లారిటీ!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి స్పందించారు. డేటింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయని తెలుసునని, కానీ నిజానిజాలు వెల్లడించేందుకు తనకు సరైన సమయం అవసరమని అన్నారు. “నేను ప్రజల ముందున్న వ్యక్తినే. నాకు సంబంధించిన విషయాలు అందరికి తెలుసుకోవాలనే ఆసక్తి సహజమే. కానీ, నా జీవితంలో ఓ ప్రత్యేక సమయం వచ్చినప్పుడు మాత్రమే వాటిని పంచుకుంటాను,” అని విజయ్ తెలిపారు.

విజయ్ తన వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన వార్తలను ఒత్తిడిగా భావించబోనని స్పష్టం చేశారు. “పబ్లిక్ ఫిగర్‌గా ఉండటం వల్ల చాలా వార్తలు వస్తాయి. వాటిని నేను సాధారణంగానే స్వీకరిస్తాను. అవి నా దృష్టిలో కేవలం వార్తలుగానే ఉంటాయి,” అని చెప్పారు. ప్రేమ గురించి మాట్లాడిన విజయ్, “అపారమైన ప్రేమ ఉంటే, దాని వెంట బాధ కూడా తప్పదు. ప్రేమించడం అంటే బాధను కూడా పంచుకోవడం” అని మరో వివరణ ఇచ్చారు.

ఇటీవల విజయ్ వ్యక్తిగత విషయాలపై అనేక రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కానీ తన వ్యక్తిగత జీవితం గురించి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తనదే అని ఆయన అభిప్రాయపడ్డారు. “తగిన సందర్భంలో, సరైన కారణంతోనే విషయాలను పంచుకుంటా,” అని విజయ్ క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో KGF లాంటి వినిమా రానుంది. ఇక రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో కూడా ఒక ప్రాజెక్టు లైన్ లో ఉంది.