పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్ చేసుకుని మూకుమ్మడిగా కొత్త సినిమాలు దాడి చేయబోతున్నాయి. అయితే తెలుగులో డబ్బింగుల తాకిడి ఎక్కువగా ఉండటం ఏ మేరకు ఓపెనింగ్స్ తెస్తుందనేది పక్కనపెడితే స్ట్రెయిట్ మూవీ ‘బచ్చల మల్లి’తో వస్తున్న అల్లరి నరేష్ కు ఒక అవకాశం నాలుగు అడ్డంకులు పరీక్ష పెట్టబోతున్నాయి. ముందు అవకాశం సంగతి చూస్తే మాస్ కంటెంట్, విలేజ్ బ్యాక్ డ్రాప్, విశాల్ చంద్రశేఖర్ సంగీతం, ఆసక్తి రేపే క్యాస్టింగ్, అంచనాలు పెంచిన ట్రైలర్ ఇవన్నీ అల్లరోడికి సాఫ్ట్ గా పని చేసే అంశాలు.
అమాంతం ఉదయం ఆటకే జనాలు హౌస్ ఫుల్స్ చేయరు కానీ మార్నింగ్ షోకు వచ్చే టాక్ చాలా కీలకం కానుంది. ఇక అడ్డంకుల సంగతి చూస్తే పేరుకి అనువాదాలే అయినా కంటెంట్ లో ఉన్న వైవిధ్యం వల్ల జనంలో వాటి పట్ల కూడా ఆసక్తి కలుగుతోంది. ‘ముఫాసా లయన్ కింగ్’కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో ఫ్యాన్స్ దాన్ని సొంతం చేసుకుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ‘విడుదల పార్ట్ 2’కి విజయ్ సేతుపతి, వెట్రిమారన్ ఇద్దరి బ్రాండ్ పని చేస్తోంది. ఉపేంద్ర చేస్తున్న నాన్ స్టాప్ ప్రమోషన్లు ‘యుఐ’కి బజ్ పెంచుతున్నాయి. వారం తర్వాత రాబోయే కిచ్చ సుదీప్ ‘మ్యాక్స్’ని తక్కువంచనా వేయడానికి లేదు.
సో అల్లరోడు వీటిని కాచుకోవడం పెద్ద సవాలే. టీమ్ మాత్రం చాలా నమ్మకంగా రోజుల తరబడి బచ్చల మల్లి గురించి మాట్లాడే కంటెంట్ ఇస్తున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి ఓ రేంజ్ లో ఊరిస్తున్నారు. ‘క’ తరహాలో వర్కౌట్ అయితే మాత్రం మంచి వసూళ్లు దక్కుతాయి. అయితే కాంపిటీషన్ ఎలా ఉన్నా భారీ ఓపెనింగ్స్ దేనికి వచ్చేలా కనిపించడం లేదు. ముందు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత థియేటర్లకు వచ్చేందుకు పబ్లిక్ ఆసక్తి చూపిస్తున్నారు. సో అల్లరి నరేష్ కనక యునానిమస్ టాక్ తెచ్చుకుంటే జనవరి 9 దాకా సోలో గ్రౌండ్ దొరుకుతుంది. సీరియస్ సబ్జెక్టుతో మెప్పించాలి మరి.
This post was last modified on December 19, 2024 11:41 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…