Movie News

కాశిలో తండేల్ పాట…ఎన్నో ప్రశ్నలకు సమాధానం!

నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర పుణ్యక్షేత్రం కాశి ఘాట్ లో శివ శక్తి పాట లాంచ్ నిర్వహించబోతున్నారు. రెగ్యులర్ గా చేసే ఈవెంట్లకు భిన్నంగా ఎలాంటి హడావిడి కూడా ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాకుళం శ్రీముఖలింగం గుడిలో జరిగే జాతర సందర్భంగా వచ్చే ఈ పాటను శేఖర్ మాస్టర్ నేతృత్వంలో భారీగా షూట్ చేశారు. సినిమా హైలైట్స్ లో ఇది ప్రధానంగా నిలుస్తుందట. చైతు, సాయిపల్లవి డాన్స్ చూసేందుకు రెండు కళ్ళు చాలవని షూటింగ్ స్పాట్ టాక్.

ప్రత్యేకంగా ఇక్కడ ప్రశ్నలకు సమాధానం అని చెప్పడానికి కారణముంది. దేవిశ్రీ ప్రసాద్ కు ఈ ఆల్బమ్ చాలా కీలకం. పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో జరిగిన రాద్ధాంతం తనకు డ్యామేజ్ చేయకపోయినా వేరొకరితో బీజీఎమ్ పంచుకోవడం ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. ఇదే తరహాలో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీకు కూడా జరిగింది. సో ఒకప్పటి వింటేజ్ దేవిని తండేల్ లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక చైతు ఈ సినిమా కోసమే చాలా సమయం ఖర్చు పెట్టాడు. వేరే కమిట్ మెంట్స్ పక్కనపెట్టి విపరీతంగా కష్టపడి, ప్రేమించి మరీ నటించాడు. దానికి న్యాయం జరగాలి.

అల్లు అరవింద్, బన్నీ వాస్ లు వంద కోట్ల దాకా బడ్జెట్ పెట్టారనే టాక్ ఉన్న నేపథ్యంలో నిజంగా అంత ఉందా అని తేలడానికి మొదటి మెట్టు ఈ శివశక్తి పాటే. 400 మంది డాన్సర్లు, రోజుకి 1000కి పైగా సెట్లో జనాన్ని తీసుకొచ్చి భారీ ఎత్తున చిత్రీకరించారు. సో చైతు ఫ్యాన్స్ దీని కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నారు. తండేల్ మొదటి ఆడియో సింగల్ ఛార్ట్ బస్టర్ అయినప్పటికీ ఇప్పుడీ శివ శక్తి మాత్రం స్పెషల్ గా నిలవనుంది. శివరాత్రి పండగ ఫిబ్రవరిలో ఉన్న నేపథ్యంలో ఎక్కడ విన్నా ఇదే పాట హోరెత్తిపోవడం ఖాయమనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. ఈ ప్రశ్నలు అన్నింటికి బదులు డిసెంబర్ 22 దొరకనుంది. చూద్దాం.

This post was last modified on December 18, 2024 4:46 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

11 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

11 hours ago