సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు, విడుదల వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం రేవంత్ రెడ్డి పేరు మరచిపోయినందుకే రాజకీయ కారణాలతో బన్నీని అరెస్టు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బన్నీ ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ తరహా పోస్టులు పెట్టిన వారికి తాజాగా పోలీసులు షాకిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. ఆ పోస్టులపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు ఇవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆ పోస్టులు పెట్టినవారికి నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. దీంతో, చాలామంది ఫ్యాన్స్ తాము ఆవేశంలో పెట్టిన పోస్టులను తొలగించే పనిలో పడ్డారట.
సీఎం రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో దూషిస్తూ నెగిటివ్ పోస్ట్‌లు, కామెంట్స్ పెట్టిన వారిని ప్రత్యేకంగా పోలీసులు టార్గెట్ చేశారట. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టు చట్ట ప్రకారమే జరిగింది. తాను పోలీసులకు సహకరిస్తానని, చట్టంపై తనకు గౌరవం ఉందని స్వయంగా అల్లు అర్జున్ చెప్పారు. సో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంయమనం కోల్పోకుండా అటువంటి పోస్టులు పెట్టకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రేవతి మరణం, శ్రీతేజ్ ఇంకా కోలుకోకపోవడం, అరెస్టు, కేసు వంటి వ్యవహారాలతో బన్నీ టెన్షన్ లో ఉన్నారని, దానికి అదనంగా ఫ్యాన్స్ ఇలా మరో కొత్త టెన్షన్ తెచ్చి పెట్టకుండా ఉండాల్సిందని నెటిజన్లు అంటున్నారు. ఆ కేసు వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అల్లు అర్జున్ అభిమానులు కూల్ గా ఉండాలని, అప్పుడే ఈ వ్యవహారం సద్దుమణుగుతుందని చెబుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి, ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల అల్లు అర్జున్ ను ఫ్యాన్స్ మరింత ఇరకాటంలో నెట్టిన వారవుతారని అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on December 18, 2024 3:57 pm
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో…
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఎముకలు కొరికే చలిలో సైతం వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష…
పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న సౌత్ దర్శకుల్లో అట్లీ ఒకడు. రాజా రాణి, తెరి, మెర్శల్, బిగిల్ లాంటి…
ప్రభాస్ కొత్త సినిమా ‘రాజా సాబ్’ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుండగా.. ఆ సినిమా వాయిదా…