Movie News

రెండోసారి ప్రయోగానికి చిరంజీవి సై!

నాలుగు దశాబ్దాలకు పైబడిన సుదీర్ఘ నటప్రయాణంలో చిరంజీవి చూడని ఎత్తుపల్లాలు లేవు. కొత్తగా ఋజువు చేసుకోవాల్సింది లేదు. అయినా సరే వయసుని లెక్క చేయకుండా ఇప్పటికీ అభిమానులను అలరించడం కోసం అదే కమిట్ మెంట్ తో కష్టపడుతున్న మెగాస్టార్ తన ఎంపికలో తప్పులు జరుగుతున్నాయని తెలిస్తే ఎంతగా అలెర్ట్ అవుతారో చెప్పడానికి భోళా శంకర్ ఉదాహరణ చాలు. దానికొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గా తీసుకుని అప్పటికే ఓకే చేసిన స్క్రిప్ట్ పక్కనపెట్టి మరీ విశ్వంభర కోసం వశిష్టకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా శ్రీకాంత్ ఓదెలకు ఎస్ చెప్పడం వెనుక కారణం కూడా అదే.

అయితే శ్రీకాంత్ ఓదెల కథలో ఎలాంటి హీరోయిన్, కమర్షియల్ సాంగ్స్ ఉండబోవడం లేదనేది లేటెస్ట్ అప్డేట్. స్టోరీ పూర్తి స్థాయిలో ఇంకా సిద్ధం కాలేదు కానీ రెగ్యులర్ ఫార్మాట్ లో మిమ్మల్ని చూపించనని ఓదెల ముందే చిరంజీవికి చెప్పి మరీ మాట తీసుకున్నాడట. అయితే ఇలా చేయడం చిరుకి ఇది మొదటిసారి కాదు. రెండేళ్ల క్రితం గాడ్ ఫాదర్ లోనూ ఈ ఎక్స్ పరిమెంట్ చేశారు. నయనతార చెల్లెలిగా నటించగా చిరంజీవికి హీరోయిన్, ఆమెతో కలిసి స్టెప్పులు వేయడం ఉండవు. కేవలం ప్రీ క్లైమాక్స్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక మొక్కుబడి పబ్ సాంగ్ ఉంటుంది. ఓదెల అలాంటి వాటికి కూడా చోటివ్వడం లేదు.

ఒకరకంగా ఇది మంచి పరిణామం. ఎందుకంటే జైలర్ లో రజనీకాంత్ తరహా పాత్రల్లో చూడాలని ఫ్యాన్స్ కోరిక. అది తీరాలంటే శ్రీకాంత్ ఓదెల, సందీప్ రెడ్డి వంగా లాంటి న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ కే సాధ్యం. సీనియర్ స్టార్ల వయసుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళిచ్చే ట్రీట్ మెంట్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయి. విక్రమ్ లో కమల్ హాసన్ కోసం లోకేష్ కనగరాజ్ చేసింది కూడా ఇదే. మరి ఓదెల తన అభిమాన హీరోని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడో. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ మొదలుపెట్టే పనుల్లో బిజీగా ఉన్న శ్రీకాంత్ ఓదెల అదయ్యాక చిరంజీవి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ చేస్తాడు. ఫ్యాన్స్ దానికోసమే వెయిటింగ్.

This post was last modified on December 18, 2024 11:17 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

4 hours ago