పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజి మీద అంచనాలు అంతకంతా పెరుగుతూ పోవడమే తప్పించి తగ్గే దాఖలాలు ఎక్కడా లేవు. ఒక చిన్న టీజర్ తోనే ఈ స్థాయి హైప్ రావడమంటే మాటలు కాదు. ప్రస్తుతం థాయిలాండ్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ గ్యాంగ్ స్టార్ డ్రామాలో నేహా శెట్టి ఒక స్పెషల్ సాంగ్ చేస్తోందని సమాచారం. తమన్ కంపోజ్ చేసిన ఒక హుషారైన పాట ఫ్యాన్స్ ని ఊపేయడం ఖాయమని అంటున్నారు. అయితే ఇందులో పవన్ లేరు. కేవలం నేహా శెట్టి మాత్రమే ఉంటుందట. క్యాస్టింగ్ లోని ఇతర ప్రధాన తారాగణం ఉండొచ్చు కానీ అసలు మాన్స్టర్ ఉండకపోవచ్చు.
చూస్తుంటే ఓజి ఒకరకంగా సలార్ ఫార్ములాని వాడుతున్నట్టు కనిపిస్తోంది. అందులో ప్రభాస్ లేట్ ఎంట్రీ ఇస్తాడు. డైలాగులు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. స్క్రీన్ టైం లెక్కేస్తే గంటకు కొంచెం అటుఇటు ఉంటుంది. కానీ ప్రశాంత్ నీల్ మేజిక్ పని చేయడం వల్ల డార్లింగ్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నట్టు ఫీలవుతాం. అదే స్క్రీన్ ప్లే కనికట్టు. కాటేరమ్మ ఫైట్, క్లైమాక్స్ అప్పటిదాకా ఉన్న బలహీనతలను కవర్ చేశాయి. ఇప్పుడు ఓజి కూడా అదే తరహాలో ఉంటుందని యూనిట్ టాక్. పవన్ కనిపించి కనిపించినట్టు ముఖ్యమైన ఎపిసోడ్స్ లో విశ్వరూపం చూపించడం ద్వారా బలమైన ముద్ర వేస్తాడన్న మాట.
విడుదల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ ముందైతే షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధం చేసే ప్లాన్ లో ఉన్నారు నిర్మాత డివివి దానయ్య. తొలుత హరిహర వీరమల్లు రిలీజ్ కావాలి కాబట్టి దాని తర్వాత కనీసం ఆరు నెలల గ్యాప్ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఉపముఖ్యమంత్రి అయ్యాక పవన్ నుంచి వచ్చే సినిమాలు కావడంతో ఫ్యాన్స్ ఉద్వేగం మాములుగా లేదు. యావరేజ్ టాక్ వచ్చినా ఆల్ టైం రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి. ఇక బ్లాక్ బస్టర్ అయితే ఏకంగా పుష్ప 2నే టార్గెట్ పెట్టుకోవచ్చు. అన్నట్టు పాటకు సంబంధించిన గెటప్ ని నేహా శెట్టి ఇన్స్ స్టాలో షేర్ చేసుకుంది.
This post was last modified on December 18, 2024 5:44 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…