సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె తనయుడు శ్రీ తేజ్ ఆరోగ్యం విషమంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే శ్రీతేజ్ ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా పరామర్శించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌కు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, బాలుడు కోలుకోవడానికి చాలా టైం పడుతుందని చెప్పారు. సంధ్య ధియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడంలో నిర్వాహకులు ఫెయిల్ అయ్యారని, ఎంట్రీ, ఎగ్జిట్, సీటింగ్ ప్లాన్ చేయలేదని ఆరోపించారు. రెండు థియేటర్లకు కలిపి ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ ఉన్నాయని అన్నారు.
అల్లు అర్జున్, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని లోపలికి అనుమతించారని, టిక్కెట్‌ల తనిఖీకి సరైన సిస్టం లేదని, అనధికారిక ప్రవేశం వల్ల రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఈ క్రమంలోనే థియేటర్ లైసెన్స్‌పై యాజమాన్యానికి పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఒకరి మృతికి కారణమైన థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు, శ్రీతేజ్ కు మరిన్ని రోజులు ట్రీట్‌మెంట్ జరగనుందని, శ్రీతేజ్ ఆరోగ్యం గురించి సమాచారం ఎప్పటికపుడు తెలుసుకుంటున్నామని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా తెలిపారు. ఇక, శ్రీతేజ్ ఆరోగ్యంపై హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. శ్రీతేజ్ పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని తెలిపారు. జ్వరం తగ్గుతోందని, మినిమం ఐనోట్రోప్స్‌లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయని చెప్పారు. ఫీడ్‌లను బాగా తట్టుకుంటున్నాడని, స్టాటిక్ న్యూరోలాజికల్ స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ పై నుంచి తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు.
This post was last modified on December 17, 2024 9:40 pm
టీడీపీలో ఇప్పుడు ఒక పేరు తరచూ వినిపిస్తోంది. ఆ పేరు 2014లో పార్టీ విజయం సాధించినప్పుడూ వినిపించింది.. ఇప్పుడు 2024…
వచ్చే ఏడాది ఏప్రిల్ 18 విడుదల కాబోతున్న ఘాటీ అనుష్క అభిమానులకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే పెర్ఫార్మన్స్ ఆధారంగా టైటిల్…
కామెడీ, కమర్షియల్, యాక్షన్ ఈ మూడు అంశాలను సరైన పాళ్లల్లో కలిపి బ్లాక్ బస్టర్లు కొట్టడంలో అనిల్ రావిపూడి శైలే…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పుష్ప 2 ది రూల్ కి ఇచ్చిన భారీ టికెట్ రేట్ల వెసులుబాట్లు ఈ రోజుతో…
ప్రభాస్ కల్కి 2898 ఏడికి సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ కు సూపర్ ప్రమోషన్ దక్కింది. సల్మాన్ ఖాన్ హీరోగా…