Movie News

నేటి నుంచి తగ్గనున్న పుష్ప 2 టికెట్ రేట్లు!!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పుష్ప 2 ది రూల్ కి ఇచ్చిన భారీ టికెట్ రేట్ల వెసులుబాట్లు ఈ రోజుతో ముగియనున్నాయి. ఇప్పటికీ ఏపీ కొన్ని కేంద్రాల్లో మల్టీప్లెక్సుల్లో 200 రూపాయల పెంపుతో ఒక్కో టికెట్ 377 ఉంది . సింగల్ స్క్రీన్ లో 250 నుంచి 295 దాకా ఉంది. ఇవన్నీ బుధవారం నుంచి సాధారణ స్థితి (110 – 177) కి చేరుకుంటాయి. నైజామ్ లో హైదరాబాద్ తో సహా గరిష్టంగా ప్రభుత్వం అనుమతించిన మాములు రేట్ (మల్టీప్లెక్స్ 295, సింగల్ స్క్రీన్ 175) ఆల్రెడీ అమలులో పెట్టగా రేపటి నుంచి వసూళ్లలో కొత్త పెరుగుదల ఉంటుందని బయ్యర్లు భావిస్తున్నారు. అధిక శాతం ప్రధాన థియేటర్లు పుష్ప 2ని మూడో వారం కొనసాగిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల కోట్ల మార్కు దాటి పరుగులు పెడుతున్న పుష్ప 2 రెండు వేల కోట్లను అందుకుంటుందా లేదానేది ఈ వారంలో తేలనుంది. కాకపోతే కొత్త రిలీజులు చాలా ఎక్కువగా ఉండటం వసూళ్లపై ప్రభావం చూపేలా ఉంది. కానీ టికెట్ రేట్లు మాములు స్థితికి రావడం బయ్యర్లు పాజిటివ్ కోణంలో చూస్తున్నారు. పుష్ప 2కి ఇంకా రావాల్సిన ఫ్యామిలీలు చాలా ఉన్నాయని, మాస్ వర్గాలు ధరల కోసం ఎదురు చూశారని, వాళ్ళందరూ వస్తే మళ్ళీ భారీ స్థాయిలో పికప్ చూడొచ్చని అంటున్నారు. ఈ వెర్షన్ లో నిజం లేకపోలేదు. అయితే ముఫాసా రూపంలో పొంచి ఉన్న కాంపిటీషన్ ని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం.

తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో ఉపేంద్ర, తెలుగులో అల్లరి నరేష్ ఇలా ప్రతి భాషలోనూ ఏదో ఒకటి చెప్పుకోదగ్గ సినిమా ఈ శుక్రవారం థియేటర్లకు వస్తున్నాయి. అవేవి పుష్ప 2 గ్రాండియర్ తో సమానం కానప్పటికీ పాజిటివ్ వస్తే చూపించే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉన్నా అల్లు అర్జున్ జోరు ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఇప్పట్లో తగ్గేలా లేదు. కనీసం 700 కోట్లకు ఫైనల్ ఫిగర్ వస్తుందని డిస్టిబ్యూటర్లు ధీమాగా ఉన్నారు. వరల్డ్ వైడ్ ఎంత అనేది తేలాలంటే డిసెంబర్ చివరి దాకా వేచి చూడాల్సిందే. గేమ్ ఛేంజర్ వచ్చే దాకా ఉన్న అడ్వాంటేజ్ ని పుష్ప 2 పూర్తిగా వాడుకోవడం ఖాయం.

This post was last modified on December 18, 2024 10:42 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మున్నాభాయ్ సీక్వెల్ మళ్లీ అటకెక్కిందా?

చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ కుమార్ హిరాని. కెరీర్…

9 minutes ago

రెండు వారాల ఉత్సాహం.. మళ్లీ నీరసం

టాలీవుడ్ అనే కాక ఇండియన్ బాక్సాఫీస్‌లో ఈ వేసవి పెద్దగా ఉత్సాహం నింపలేకపోయింది. మామూలుగా సమ్మర్లో పెద్ద సినిమాలు రిలీజై…

2 hours ago

పాక్ – భారత్ వివాదం.. చైనా+అమెరికా విషపు ఆలోచన!

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు…

4 hours ago

వారి గురుంచి ఆరా తీస్తున్న జ‌గ‌న్‌

వైసీపీ హ‌యాంలో ప‌దవులు ద‌క్కించుకున్న‌ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెల‌కు 3 ల‌క్ష‌ల‌కు పైగానే వేత‌నాల రూపంలో…

5 hours ago

‘తమ్ముడు’కి ఎన్నెన్ని కష్టాలో…

నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…

5 hours ago

ఓజీకే ఊగిపోతుంటే.. ఉస్తాద్‌ కూడానట

జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…

6 hours ago