ప్రభాస్ కల్కి 2898 ఏడికి సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ కు సూపర్ ప్రమోషన్ దక్కింది. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సికందర్ కి ఆయన్నే సంగీత దర్శకుడిగా తీసుకున్నారని బాలీవుడ్ టాక్. డిసెంబర్ 27 కండలవీరుడి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోయే టీజర్ లో తన బీజీఎమ్ వినొచ్చని సమాచారం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సికందర్ వచ్చే ఏడాది ఈద్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మూడు వందల కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారని సమాచారం. మురుగదాస్ తన బాలీవుడ్ ఎంట్రీని బ్లాక్ బస్టర్ తో జరిపించాలని కష్టపడుతున్నాడు.
ప్రత్యేకంగా సంతోష్ నారాయణన్ కి ఇది ప్రమోషన్ అనడానికి కారణాలున్నాయి. ఇప్పటిదాకా ఏఆర్ రెహమాన్ తప్ప హిందీలో బలమైన ముద్ర వేసిన వాళ్ళు లేరు. దేవిశ్రీ ప్రసాద్ చేశాడు కానీ ఎక్కువ ఆఫర్లు రాలేదు. ఇళయరాజా ముద్ర పడలేదు. మణిశర్మ అసలు ప్రయత్నించలేదు. నాని దసరాతో తానేంటో రుజువు చేసుకున్న సంతోష్ నారాయణన్ కల్కి 1తో నార్త్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. త్వరలో కల్కి 2కి కంపోజింగ్ మొదలుపెట్టబోతున్నాడు. బ్యాలన్స్ షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేది ఇంకా డిసైడ్ చేయలేదు కానీ దర్శకుడు నాగ అశ్విన్ తో కలిసి త్వరలోనే పని ప్రారంభించవచ్చని ఇన్ సైడ్ టాక్.
నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అవకాశం సంతోష్ కే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అనిరుద్ రవిచందర్ ని ట్రై చేసినప్పటికీ అది సాధ్యమయ్యే సూచనలు తక్కువగా ఉండటం వల్ల దసరా కాంబోనే మళ్ళీ రిపీట్ చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు తెలిసింది. హీరో దర్శకుడు ఎవరిని ఫైనల్ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ ఇది ఓకే అయితే మాత్రం చిరంజీవి ఓదెల మూవీ కూడా లాక్ కావొచ్చు. ఇవన్నీ ప్రస్తుతానికి ప్రాధమిక అంచనాలే కానీ కొద్దిరోజులు ఆగితే స్పష్టత వస్తుంది. ప్రస్తుతం తను సూర్య – కార్తీక్ సుబ్బరాజ్ – పూజా హెగ్డే మూవీకి రీ రికార్డింగ్ పనుల్లో ఉన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates