పుష్ప-2 ప్రిమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతికి సంబంధించిన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం, ఒక రాత్రి జైలులో ఉంచడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. మహిళ మృతిలో బన్నీ ప్రమేయం ఏముందని.. ఈ కేసులో అతణ్ని అరెస్ట్ చేయడం టూమచ్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అరెస్టయిన రోజే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ.. ఒక రాత్రి జైల్లో ఉంచాకే బన్నీని రిలీజ్ చేయడం పట్ల నిరసన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫిలిం సెలబ్రెటీలు బన్నీ ఇంటికి వచ్చి అతణ్ని పరామర్శించారు. అరెస్టును సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది సెలబ్రెటీలు ఖండించారు. బాలీవుడ్ నుంచి కూడా బన్నీకి సానుభూతి వ్యక్తమైంది. నేషనల్ మీడియాలో సైతం బన్నీకి అనుకూలంగా చర్చ జరిగింది. ఐతే టాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి మాత్రం బన్నీ అరెస్టును సమర్థించారు. ఆయనెవరో కాదు.. తమ్మారెడ్డి భరద్వాజ. ఏ విషయం మీదైనా నిక్కచ్చిగా అభిప్రాయాలు చెబుతారని పేరున్న తమ్మారెడ్డి.. బన్నీ అరెస్ట్ మీద ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
జాతీయ అవార్డు సాధించిన నటుడిని ఇలా అరెస్ట్ చేయడం కరెక్టేనా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘అల్లు అర్జున్ జాతీయ అవార్డు సాధించినంత మాత్రాన తప్పు చేయొచ్చని కాదు. తప్పు చేసినా మన్నించాలని కూడా కాదు. మరి నేషనల్ అవార్డు సాధించాను, మర్డర్ చేస్తాను అంటే ఒప్పుకుంటారా? దీనికి, దానికి సంబంధం లేదు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతికి, అల్లు అర్జున్‌కు నేరుగా సంబంధం లేకపోవచ్చు. కానీ దీనికి అతను నైతిక బాధ్యత వహించాల్సిందే.
బన్నీ అక్కడికి వెళ్లి ర్యాలీ చేయడం వల్లే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ విషయంలో పోలీసులు, థియేటర్ యాజమాన్యం వైఫల్యం కూడా ఉంది. కానీ బన్నీకి ఈ ఉదంతంతో సంబంధం లేదని మాత్రం చెప్పలేం. అతణ్ని అరెస్ట్ చేయడంలో పోలీసులు చట్టపరంగా తమ బాధ్యతను నిర్వర్తించారు. ఇందులో వాళ్లను తప్పుబట్టడానికి కూడా ఏమీ లేదు’’ అని తమ్మారెడ్డి స్పష్టం చేశారు.
This post was last modified on December 17, 2024 10:13 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…