మంచు కుటుంబ గత కొన్ని రోజులుగా కుటుంబ వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ వివాదంలో తాను కూడా భాగం అయినప్పటికీ మంచు విష్ణు మాత్రం.. తన సినిమాలకు సంబంధించి ప్రమోషన్ మాత్రం ఆపట్లేదు. కుటుంబ గొడవ తారా స్థాయికి చేరిన పరిస్థితుల్లోనే.. హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్‌తో ఆయన చేతులు కలుపుతున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. తాజాగా తన ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ నుంచి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చాడు. మలయాళ లెెజెండరీ నటుడు మోహన్ లాల్ పాత్రకు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఈ చిత్రంలో మోహన్ లాల్ కిరాట అనే పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. కిరాట పాశుపతాస్త్రాన్ని సంధించడంలో నేర్పరి అట. విజేత మీద విజయం సాధించిన కిరాట.. అడవికి రాజు అని కూడా పేర్కొన్నారు క్యారెక్టర్ ఇంట్రో పోస్టర్లో. లాల్ లుక్ విభిన్నంగా, వైల్డ్‌గా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. కిరాట పాత్రకు సంబంధించిన మొత్తం ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని విష్ణు చెబుతున్నాడు.
చిత్ర వర్గాల సమాచారం ప్రకారం కూడా సినిమాలో మోహన్ లాల్ ఎపిసోడ్ మేజర్ హైలైట్‌గా ఉంటుందని తెలుస్తోంది. లాల్ మామూలు పాత్రలను కూడా తనదైన పెర్ఫామెన్స్‌తో వేరే లెవెల్లో నిలబెడతాడు. కిరాట పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని.. తనకు, కన్నప్పకు మధ్య పోరాటం అదిరిపోతుందని అంటున్నారు. మోహన్ లాల్ ఒప్పుకున్నాడంటేనే ఇది ప్రత్యేకమైన పాత్ర అయి ఉంటుందని అభిమానుల్లో అంచనాలున్నాయి. డిసెంబరులోనే రావాల్సిన ‘కన్నప్ప’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది.
This post was last modified on December 16, 2024 5:30 pm
ప్రపంచ టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పేరుపొందిన ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ‘‘ఎక్స్ మెయిల్’’ పేరుతో…
భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి రూ. 11.34…
బాలీవుడ్ లోనే కాదు మనకూ బాగా పరిచయమున్న విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్. సుమంత్ ప్రేమకథతో టాలీవుడ్ కు…
క్రిస్మస్ పండక్కి బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన పోటీ ఉంటుందని భావించారు ముందు. కానీ ఆ సీజన్ దగ్గర పడేసరికి కథ…
తెలంగాణ అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం చర్చల మధ్య తీవ్ర అభ్యంతరాలతో ముగిసింది. సభకు సంబంధించిన రోజులను…
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌లో తలపడుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ…