అభిమానులందు మహేష్ బాబు అభిమానులు వేరయా అని కొత్త సామెత రాయలేమో. మహేష్ బాబు ఫ్యాన్స్ తీరు చూస్తుంటే అలాగే ఉంది. డిసెంబర్ 20 విడుదల కాబోతున్న ముఫాసా ది లయన్ కింగ్ కు హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో ఉదయం 8 గంటలకు బెనిఫిట్ షో వేయబోతున్నారు. దీని టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంటోంది. బెంగళూరు వినాయక థియేటర్ దగ్గర అతి పెద్ద కటవుట్ నెలకొల్పిన తరహాలోనే ఇక్కడ కూడా భారీ ప్లానింగ్ చేస్తున్నారని తెలిసింది. డీజేలు, బ్యానర్లు, బాణాసంచా వగైరాలన్నీ స్టార్ హీరో రెగ్యులర్ రిలీజ్ కు తీసిపోని రీతిలో ఉంటాయని ఫ్యాన్ అసోసియేషన్ల సమాచారం.
ఇంతా చేసి ముఫాసాకు మహేష్ బాబు చెప్పింది కేవలం డబ్బింగ్ మాత్రమే. మనిషి కనిపించడు. ఆ మాటకొస్తే ఈ హాలీవుడ్ మూవీ పూర్తిగా బొమ్మల ఆధారంగా అంటే యానిమేషన్ లో తీసింది. కొత్త టెక్నాలజీ కాబట్టి తెరపై పాత్రలు సజీవంగా ఉన్నట్టు అనిపిస్తాయి తప్పించి అవేవి నిజం కాదు. మరి ఈ మాత్రం దానికి ఇంత హంగామా ఎందుకయ్యా అంటే మళ్ళీ మహేష్ ని ఎప్పుడు చూస్తామో ఎప్పుడు వింటామో అందుకే ఎంజాయ్ చేసేస్తామని అంటున్నారు. ముఫాసా రెగ్యులర్ వెర్షన్లతో పాటు ఐమాక్స్, త్రీడి, ఫోర్డిఎక్స్ తదితర అన్ని ఫార్మాట్లలో రిలీజ్ కానుంది. స్పెషల్ షో వేసేది మాత్రం నార్మల్ 2డిలోనేనట.
మహేష్ పెట్టని కోటగా భావించే సుదర్శన్ లో ముఫాసా రిలీజ్ కావడం చూస్తే ఇది మాములు అరాచకం అనిపించడం లేదు. రెండు గంటల పాటు మహేష్ గొంతు విన్నా అది చూసినదాంతో సమానమని తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఇంకా నయం విదేశాల్లో ఉండటం వల్ల మహేష్ అందుబాటులో లేడు కానీ ఒకవేళ ఇండియాలో ఉండి ప్రమోషన్లు కూడా చేసి ఉంటే ఇంకే స్థాయిలో సెలబ్రేషన్స్ చేసేవాళ్ళో. జనవరి నుంచి రాజమౌళి సినిమా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దానికి ఎక్కువ సమయం పట్టకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయినా అది వాళ్ళ చేతిలో ఎక్కడుంది. అంతా జక్కన్న అదుపాజ్ఞల్లోనే.
This post was last modified on December 16, 2024 4:55 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…