తమ జీవితంలో అనుభవాలనే కథలుగా మార్చి సినిమాలు తీసే దర్శకులు చాలామందే ఉన్నారు. ఐతే లార్జర్ ధ్యాన్ లైఫ్ సినిమాలే తీసే రాజమౌళి కూడా ఇలా ఓ సినిమా తీశాడని.. పైగా ఆయనకు స్ఫూర్తిగా నిలిచింది ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం అని తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేం. రానా దగ్గుబాటి టాక్ షోలో ఆయన ఈ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. రాజమౌళి సినిమాల్లో ఒక సిన్సియర్ ప్రేమకథను చూపించిన సినిమా అంటే.. ‘ఈగ’నే.
ఈ కథలోకి ఈగ పాత్ర వచ్చే వరకు నాని-సమంత మధ్య అందమైన ప్రేమకథను చూస్తాం. ఈ ప్రేమకథకు తన జీవితంలో ఓ అమ్మాయితో వన్ సైడ్ లవ్ స్టోరీనే స్ఫూర్తి అని రాజమౌళి తెలిపాడు. ఇంటర్మీడియట్ రోజుల్లో తాను భారతి అనే అమ్మాయిని ప్రేమించినట్లు జక్కన్న వెల్లడించాడు. ఆ అమ్మాయి అంటే తనకు చాలా ఇష్టమని.. కానీ బేసిగ్గా చాలా బిడియస్థుడు కావడంతో ఆ అమ్మాయితో మాట్లాడేవాడినే కాదని జక్కన్న తెలిపాడు.
తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు కాలేజీలో అందరికీ తెలుసని.. స్నేహితులు ఈ విషయంలో తనను ఏడిపిస్తూ ఉండేవారని.. కానీ ఆ అమ్మాయితో మాట్లాడేందుకు ధైర్యం సరిపోయేది కాదని రాజమౌళి తెలిపాడు. మొత్తానికి ఒక రోజు ఆమెతో మాట్లాడానని.. ‘‘భారతీ.. ఎగ్జామ్ ఫీజు కట్టావా’’ అని అడిగానని రాజమౌళి వెల్లడించాడు. ‘‘నేను ఎంతో కాలంగా నువ్వు పిలుస్తావని ఎదురు చూస్తున్నా’’ అన్నట్లుగా ఆమె తన వైపు చూసిందని.. తన కళ్లలో ఒక మెరుపు కనిపించిందని.. కానీ తాను అడిగిన ప్రశ్న విన్నాక ఇది అడగడానికా పిలిచావు అన్నట్లు నిరాశగా చూస్తూ తల ఊపి వెళ్లిపోయిందని ఆయన తెలిపాడు.
ఆమె తన వైపు చూసినపుడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ను ఎప్పటికీ మరిచిపోలేనని ఆయనన్నాడు. ఇలా మాట్లాడకుండా కళ్లతోనే సాగిన తన ప్రేమకథనే ‘ఈగ’ సినిమాలో తొలి అరగంటలో నాని-సమంత మధ్య చూపించానని.. చాలామంది దర్శకులు ఇలాగే తమ అనుభవాలను సినిమాలో చూపిస్తుంటారని రాజమౌళి వ్యాఖ్యానించాడు.
This post was last modified on December 15, 2024 6:12 pm
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…
ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…
ఐపీఎల్లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…