Movie News

బ‌న్నీ అరెస్టుపై చిరు భార్య ఏమ‌న్నారు?

పుష్ప‌-2 సినిమా ప్ర‌ద‌ర్శ‌న సంద‌ర్భంగా తొక్కిస‌లాట చోటు చేసుకుని ఓ మ‌హిళ మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్‌ను హైద‌రాబాద్ పోలీసులు అరెస్ట్ చేయ‌డం.. అత‌ను ఒక రోజు జైలులో ఉండి విడుద‌ల కావ‌డంతో ఇండ‌స్ట్రీ నుంచి ఎంతోమంది ప‌రామ‌ర్శ‌కు వెళ్లారు. శ‌నివారం ఉద‌యం నుంచి బ‌న్నీ ఇల్లు సెల‌బ్రెటీల‌తో క‌ళ‌క‌ళ‌లాడిపోయింది. పొద్దుపోయే వ‌ర‌కు ప‌రామ‌ర్శ‌లు కొన‌సాగాయి.

బ‌న్నీని విక్ట‌రీ వెంక‌టేష్ స‌హా ఎంతోమంది స్టార్లు, స‌న్నిహితులు, బంధువులు క‌లిసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా.. అన్నింట్లోకి ఒక వీడియో మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. బ‌న్నీ మేన‌త్త‌, చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ‌.. బ‌న్నీని క‌లిసిన వీడియో అంద‌రినీ అమితంగా ఆక‌ట్టుకుంది. మేన‌ల్లుడిని ఆమె ఆప్యాయంగా హ‌త్తుకోవ‌డం.. బ‌న్నీ భావోద్వేగానికి గుర‌వుతూ ఆమె చేతికి ముద్దుపెట్ట‌డం అంద‌రికీ చూడ‌ముచ్చ‌ట‌గా అనిపించింది.

ఇటీవ‌ల మెగా ఫ్యామిలీకి, అల్లు కుటుంబానికి కొంచెం దూరం పెరిగిన‌ట్లు భావిస్తున్న నేప‌థ్యంలో బ‌న్నీని సురేఖ క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ సంద‌ర్భంగా సురేఖ‌ను అక్క‌డున్న ఓ పెద్ద మ‌నిషి.. బాగా కంగారు ప‌డ్డ‌ట్లున్నారే అని అడగ్గా, అందుకామె బ‌దులిస్తూ అంతే క‌దండీ. పిల్ల‌ల‌కు ఇలా జ‌రిగితే టెన్ష‌న్ ప‌డ‌తాం క‌దా. నిన్న ఆయ‌న కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వ‌చ్చేశారు అని వ్యాఖ్యానించింది. ఆయ‌న అంటే ఇక్క‌డ చిరంజీవి అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

బ‌న్నీ అరెస్ట‌వ‌గానే చిరంజీవి.. త‌న ఇంటికి వ‌చ్చేశారు. అంతే కాక త‌న‌కు క్లోజ్ ఫ్రెండ్ అయిన లాయ‌ర్ నిరంజ‌న్ రెడ్డిని పుర‌మాయించి.. ఈ కేసు టేక‌ప్ చేసేలా చూశారు. నిరంజ‌న్ రెడ్డి కోర్టులో స‌మ‌ర్థంగా వాదించి బ‌న్నీకి మ‌ధ్యంత‌ర బెయిల్ వ‌చ్చేలా చూశారు. మొత్తానికి బ‌న్నీ అరెస్ట్ ఉదంతంతో.. ఇప్ప‌టిదాకా మెగా, అల్లు కుటుంబాల మ‌ధ్య నెల‌కొన్న చిన్న గ్యాప్ పూడుకున్న‌ట్లే క‌నిపిస్తోంది.అంతా మ‌న మంచికే అనే మాట ఇలాంటి సంద‌ర్భాల్లోనే నిజం అనిపిస్తుంది ఎవ‌రికైనా.

This post was last modified on December 15, 2024 9:46 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago