ప్రపంచ సినీరంగంలో తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చిన దిగ్గజ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి అందరికీ సుపరిచితులే. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన జక్కన్న సినిమాలు చెక్కడంలో ఆరితేరారు. అయితే, రాజమౌళిలో ఓ అద్భుతమైన డ్యాన్సర్ దాగి ఉన్నాడని మీకు తెలుసా? తాజాగా సింహా పెళ్లికి సంబంధించిన ఈవెంట్ లో భార్య రమతో కలిసి రాజమౌళి వేసిన స్టెప్పుల వీడియో వైరల్ గా మారింది.
యాక్షన్..కట్…పేకప్ అంటూ షూటింగ్ లతో తాను బిజీగా ఉంటూ తన చిత్ర యూనిట్ ను పరుగులు పెట్టించే జక్కన్న సమయం దొరికితే కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే కీరవాణి తనయుడు సింహా పెళ్లి ఈవెంట్ లో జక్కన్న చిందేశాడు. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం నుంచి ‘‘లంచ్ కొస్తావా..మంచెకొస్తావా…’’ పాటకు జక్కన్న అదిరిపోయే స్టెప్పులేశాడు.
ప్రస్తుతం రమతో కలిసి జక్కన్న డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే, ఈ వీడియో చూసిన మహేశ్ బాబు అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. రాజమౌళి, మహేశ్‌బాబు చిత్రం నుంచి అప్డేట్ కోసం తాము కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే జక్కన్న ఎంచక్కా లంచ్ కొస్తావా అంటూ స్టెప్పులేస్తున్నారని మీమ్స్ పేలుస్తున్నారు.
ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ బాబుల సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ గురించి ఇప్పటిదాకా అఫీషియల్ గా ఏ అప్డేట్ రాలేదు.
This post was last modified on December 14, 2024 8:20 pm
పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఓ మహిళ మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్‌ను…
రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ నమ్మరు. కానీ..రాజకీయాలు సాగుతాయి. అయితే.. ఉన్నవారిలో ఎవరు బెస్ట్ అనేది పార్టీల అధినేతలు నిర్ణయించుకోవాలి. కొన్ని…
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అనేది…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. "ఎమ్మెల్యేలు అయిపోయాం కదా.. అని…
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టయి ఈరోజు ఉదయం చంచల్ గూడ జైలు నుంచి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే…