టాలీవుడ్ ఎప్పుడూ చూడని సంఘటన ఇది. అభిమానులను కలవరానికి గురి చేయడమే కాక ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆందోళనకు గురవుతున్నాయి. నిజానికి సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోవడం ఊహించనిది. ఇలాంటిది జరుగుతుందని తెలిస్తే ఏ హీరో అక్కడికి రాడు. కానీ దురదృష్టవశాత్తు విధి వక్రీకరించింది. ఒక కుటుంబంలో విషాదం రేగడం ఎవరూ హర్షించరు. అల్లు అర్జున్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ పాతిక లక్షల పరిహారంతో పాటు ఆ ఫ్యామిలీకి అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తానని పబ్లిక్ గా హామీ ఇచ్చాడు. ఇదంత జరిగిన రోజుల వ్యవధిలోనే ఇప్పుడీ అరెస్ట్ కలకలానికి దారి తీస్తోంది.
రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం సెలవులు కావడంతో అల్లు అరవింద్ తరఫున లాయర్లు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. సోమవారం వరకు ఎలాంటి అరెస్ట్ లేకుండా బయటికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్య పరీక్షల కోసం బన్నీని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మధ్యాన్నం నాలుగు గంటలకు పిటీషన్ విచారణ వాయిదా వేసిన కోర్టు తర్వాత ఏ నిమిషమైనా బెయిల్ లేదా రిమాండ్ కు సంబంధించిన ఉత్తర్వులు వెలువరించనుంది. అల్లు అర్జున్ తరఫున ప్రముఖ న్యాయవాది, వైసిపి రాజ్యసభ ఎంపీ నిర్మాత నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు. ఇంకో వైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చిరంజీవి వస్తున్నారనే ప్రచారం జరిగింది కానీ ఆ స్థానంలో ఆయన కొన్ని నిమిషాల క్రితమే సతీమణి సురేఖ తో బన్నీ ఇంటికి చేరుకున్నారు. మరోపక్క స్టేషన్ వద్దకు రావద్దని చిరుని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నట్టు సమాచారం. మరి చిరు వెళ్తారో లేదో వేచి చూడాలి. గంట నుంచి దిల్ రాజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు.
ఇంత పెద్ద స్టార్ హీరో వెయ్యి కోట్ల గ్రాసర్ ని సాధించిన ఆనందంలో ఉండగా ఇలా తాత్కాలికంగా అయినా సరే అరెస్ట్ కావాల్సి రావడం విచారించాల్సిన విషయం. ఒక నేరానికి నిజంగా బాధ్యుడు అయితే చట్టం ముందు ఎవరైనా ఒకటే. కానీ అల్లు అర్జున్ విషయంలో అలా జరగలేదు. తనకు తెలియకుండా జరిగిన తోపులాటలో ఒక స్త్రీ ప్రాణాలు కోల్పోయింది. అలా జరగాలని ప్రపంచంలో ఏ హీరో కోరుకోడు. సో వాస్తవిక కోణంలో చూసుకుని ఈ కారణాలు విశ్లేషించుకుంటే బన్నీకి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన లాయర్ల కామెంట్. ఏది ఏమైనా ప్రస్తుతం హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ దేశవ్యాప్తంగా టాపిక్ అయిపోయింది.
This post was last modified on December 13, 2024 3:01 pm
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…